ముంబయిలో అంబేడ్కర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ఫొటో సోర్స్, Twitter
ముంబయిలో డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ నివాసం రాజగృహపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
దాడి సందర్భంగా అక్కడున్న సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు.
ఈ విధ్వంసానికి సంబంధించి ఏఎన్‌ఐ వార్తా సంస్థ కొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది.
ఇంటి ముందున్న పూల మొక్కలను, కుండీలను ధ్వంసం చేసినట్లు అందులో కనిపిస్తోంది.
దాడి విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ సంఘటనను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
డాక్టర్ అంబేడ్కర్ నివాసం 'రాజ్‌గృహ'పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరో ఇద్దరు మంత్రులు జయంత్ పాటిల్, ధనంజయ్ ముండే కూడా ఈ సంఘటనను ఖండించారు.
ప్రజలు ఆవేశానికి లోను కావద్దని డాక్టర్ అంబేద్కర్ మనవడు వంచిత్ బహుజన్ అగాధీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ విజ్ఞప్తి చేశారు.
"ప్రజలు రాజగృహకు రావద్ద"ని ఆయన సూచించారు. దీన్ని 'చిన్న సంఘటన'గా తీసుకోవాలని, ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం కూడా శాంతిని కోరుకుంటుందని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








