కరోనావైరస్: భారత్‌లో మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు... రెడ్ జోన్లలో మరిన్ని ఆంక్షలు

ఫొటో సోర్స్, Getty Images
మే 4 తరువాత మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడంలో లాక్‌డౌన్ వల్ల ఫలితాలు కనిపిస్తున్నాయని, లాక్‌డౌన్ మరి కొంత కాలం పొడిగించడం అవసరమని వెల్లడించింది.
దేశంలో పరిస్థితులను పూర్తి స్థాయిలో సమీక్షించిన తరువాత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు భారత హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ - 2005 కింద ప్రస్తుతం మే 4 వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్ ను మరో రెండువారాల పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ లాక్‌డౌన్ కాలంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా హోం శాఖ విడుదల చేసింది. హాట్ స్పాట్స్ అంటే రెడ్ జోన్లు, ఇంకా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించవచ్చో నిర్దేశించింది.
గ్రీన్ జోన్ అంటే అసలు కోవిడ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాలు లేదా 21 రోజుల వ్యవధిలో కొత్త కేసులు నమోదు కాని జిల్లాలు. ఇక, కేసుల సంఖ్య అధికంగా ఉండి, రెట్టింపు సంఖ్యలో నిర్ధరణలు జరుగుతున్న జిల్లాలు రెడ్ జోన్ల కిందకు వస్తాయి. ఈ రెండింటికీ మధ్యలో ఉన్నవి గ్రీన్ జోన్లు. అయితే, జోన్ల వర్గీకరణలో వచ్చే మార్పులను పరిగణనలోకి తీసుకుని ఏ వారానికి ఆ వారం కేంద్ర ప్రబుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జోన్ల జాబితాలను పంపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
రెడ్ జోన్లలో ఇప్పటికే ఉన్న ఆంక్షలతో పాటుగా సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, జిల్లాల మధ్య బస్సుల రవాణా, బార్బర్ షాపులు, సెలూన్లను కూడా నిషేధించారు.
జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైలు, మెట్రో, అంతర్ రాష్ట్ర బస్సు ప్రయాణాలపై నిషేధం ఎప్పట్లాగే కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడంపైన కూడా నిషేధం కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








