వి-అన్‌బీటబుల్: అమెరికన్ టీవీ టాలెంట్ షో ఫైనల్స్ గెలిచిన ముంబయి డాన్సర్లు

వి- అన్బీటబల్

ఫొటో సోర్స్, Instagram/V Unbeatable

'వి- అన్‌బీటబుల్' బృందం స్టేజిపై డాన్స్ చేస్తుంటే ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు చూస్తున్నపుడు ఉండే ఉత్కంఠ కలుగుతుంది. 'వి- అన్‌బీటబుల్' ముంబయికి చెందిన ఒక డాన్స్ గ్రూప్.

వీరు డాన్స్ చేస్తుంటే నరాలు తెగేలా, ఉత్తేజం కలిగించే ఆటగాళ్ల ప్రదర్శనలా ఉంటుంది.

ఈ గ్రూప్ సభ్యులు "అమెరికాస్ గాట్ టాలెంట్ - 15వ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు.

Presentational grey line
News image
Presentational grey line

ఫైనల్స్‌లో అమెరికన్ డ్రమ్మర్ ట్రావిస్ బార్కర్ రాక్ పాటకి ఈ బృందం చేసిన డాన్స్ ప్రేక్షకుల మతిపోగొట్టింది.

బార్కర్ గాలిలోకి లేపిన డ్రమ్ స్టిక్‌ని బృందంలోని ఒక డాన్సర్ వెనుక నుంచి ఎగురుతూ వచ్చి అవలీలగా అందుకుని, గొడుగులా మారిన మిగతా డాన్సర్స్ మీద వాలిన విన్యాసం ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది.

ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన హౌయి మన్డేల్, సైమన్ కోవెల్, హీది క్లమ్, అలీషా డిక్సన్ స్టేజి మీద జరిగేది చూసి, తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు.

అందరూ ఒక్కసారిగా లేచి నిల్చుని డాన్సర్స్ బృందానికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆ క్షణం అసలు కలలా అనిపించింది" అని ఈ డాన్సర్స్ బృందానికి నాయకత్వం వహించిన ఓం ప్రకాష్ బీబీసీకి చెప్పారు.

"మేము చాలా కష్టపడ్డాం. ఈ క్షణాన్ని చేజార్చుకోలేం. మేమెప్పుడూ విజేతలమే" అన్నాడు.

కానీ, వీళ్ళకు ఇది అంత సులభంగా దక్కిన విజయం కాదు. ఈ ప్రయాణంలో విషాదం కూడా దాగి ఉంది.

కొన్నేళ్ల క్రితం ఓం ప్రకాశ్ ఉత్తరప్రదేశ్‌లోని తన ఇంటిని వదిలి పని వెతుక్కుంటూ బయటకు వచ్చాడు. అతడు పదేళ్ల వయసులో నెలకు అయిదు వేల రూపాయల జీతానికి ఒక గాజు వస్తువుల ఫ్యాక్టరీలో పనికి చేరాడు.

జీతంలో డబ్బులు మిగుల్చుకోవడం కోసం, ఆ ఫ్యాక్టరీలోనే పడుకుని, అక్కడే తినేవాడు. మిగిలిన డబ్బు ఇంటికి పంపేవాడు.

"ఆ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఒక తోటలో కొంత మంది పిల్లలు డాన్స్ చేయడానికి వచ్చేవారు. వాళ్ళు రోజూ డాన్స్ చేయడం చూసి, నేనూ వాళ్ళ దగ్గర నుంచి డాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాను" అని చెప్పాడు.

అదే సమయంలో ప్రకాశ్, పిల్లలతో కలిసి డాన్స్ చేసే వికాస్‌ను కలిశాడు. ఇద్దరూ కలిసి ఒక డాన్స్ గ్రూప్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనకు వచ్చారు.

ఆ బృందంలో డాన్స్ చేసే పిల్లలు ముంబయిలోని నయీ గావ్, భయందర్ మురికి వాడలు నుంచి వచ్చేవారు.

"వాళ్ళ ప్రయాణ చార్జీలు నేనే పెట్టుకుంటాను. వాళ్ళని డబ్బు ఎలా అడగగలను. వాళ్ళు నా పిల్లలు" అంటాడు ఓం ప్రకాష్.

ఈ బృందం మేకప్, ఆహారం, ప్రయాణ ఛార్జీలకు అతడు తన జీతం డబ్బునే ఉపయోగించేవాడు.

అంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి.

వికాస్ డాన్స్ చేస్తున్నప్పుడు ఒక ఘోర ప్రమాదం జరిగింది. అతని ఎడమ భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నప్పటికీ డాక్టర్లు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు.

అమెరికాస్ గాట్ టాలెంట్ - 15 వ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న 'వి- అన్బీటబల్'

ఫొటో సోర్స్, Instagram/V Unbeatable

ఫొటో క్యాప్షన్, అమెరికాస్ గాట్ టాలెంట్ - 15 వ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న 'వి- అన్బీటబల్'

వికాస్‌కి నివాళిగా డాన్స్ ప్రదర్శన ఇచ్చే ప్రతిసారీ, వారంతా వెనుక అతని పేరు ఉండే జాకెట్లు ధరిస్తారు. తన పేరులోని 'వి' అనే మొదటి అక్షరాన్ని తమ గ్రూప్ పేరుకు చేర్చి దానిని 'వి-అన్‌బీటబుల్'గా మార్చారు.

ఈ బృందం అతి తక్కువ కాలంలోనే వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇవ్వడం, చిన్న చిన్న డాన్స్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది.

"మేము పోటీల్లో గెలవడం మొదలైంది. గెలిచిన డబ్బుతో బృందంలో సభ్యులు పార్టీ చేసుకుంటుంటాం. మేము దీనికి అర్హులమే అని మాకు అనిపిస్తుంది. మేము డబ్బు దాచుకోవాలని ఆలోచించడం లేదు" అని ఓం ప్రకాష్ చెప్పారు.

"అమెరికాస్ గాట్ టాలెంట్" నుంచి తమ పోటీలో పాల్గొనాలని ఈ- మెయిల్ వచ్చినపుడు ఓం ప్రకాష్ తమ బృందంతో కలిసి పని చేస్తున్న కొరియోగ్రాఫర్ రోహిత్ జాదవ్‌ని సాయం చేయమని అడిగాడు.

"నేను కొరియోగ్రాఫర్‌గా ఉన్న మరో రియాలిటీ షో లో ఓం ప్రకాష్ బృందం ప్రదర్శన చూసా" అని జాదవ్ బీబీసీకి చెప్పారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

"నాకు ఇది కల నిజమైనట్టు ఉంది. ఇంకా పెద్దగా కలలు కనాలని వాటిని అందుకోవాలని ఉంది. ఈ విజయం ఎన్నో ఏళ్లుగా నేను శిక్షణ ఇస్తున్న ఈ పిల్లలు అందరిదీ" అని ఓం ప్రకాష్ అన్నారు .

"పిల్లలు ఈ ప్రదర్శనకి కావల్సిన అన్ని పనులు చూసుకున్నారు. ఇక మాకంటూ ఒక డాన్స్ స్టూడియో ఏర్పాటు చేసుకుని, ఆసక్తి ఉన్న పిల్లలకి శిక్షణ ఇవ్వడమే మా ఆశయం" అని అయన అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)