India Vs New Zealand: శ్రేయస్ దూకుడు.. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్ పర్యటనను టీమ్ ఇండియా విజయంతో ఆరంభించింది. శ్రేయస్ అయ్యర్ (58 నాటౌట్), కేఎల్ రాహుల్ (56), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45) బ్యాట్‌తో రాణించడంతో టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరొక ఓవర్ మిగిలుండగానే భారత్ పూర్తి చేసింది.
చివరి ఐదు ఓవర్లలో విజయానికి 53 పరుగులు కావాల్సిన స్థితిలో అవసరానికి తగ్గట్టు శ్రేయస్ విజృంభించాడు.
తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. 29 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది.
ఆ జట్టు బ్యాట్స్‌మెన్ మున్రో (59), విలియమ్సన్ (51), టేలర్ (54) అర్ధశతకాలు సాధించారు.
భారత బౌలర్లు బుమ్రా, చాహల్, శివం దూబే, జడేజా, శార్దూల్ తలో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Reuters
రాహుల్, కోహ్లీ కలిసి..
ఓపెనర్ రోహిత్ శర్మ (7) వికెట్‌ను భారత్ రెండో ఓవర్‌లోనే కోల్పోయింది.
అయితే, కోహ్లీ, రాహుల్ కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిర్మించారు.
రెండో వికెట్‌కు వీళ్లిద్దరూ కలిసి 99 పరుగులు జోడించారు.
పదో ఓవర్ చివరి బంతికి జట్టు స్కోరు 115 పరుగులు ఉండగా, రాహుల్ సోది బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే (12 ఓవర్ తొలి బంతికి) కోహ్లీ కూడా క్యాచౌట్‌గా వెనుదిరిగాడు.
రాహుల్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ మొదట కాస్త నెమ్మదిగానే ఆడాడు.
14వ ఓవర్‌లో శివం దూబే (14) వికెట్ పడింది. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 151-4.
గెలవడానికి 30 బంతుల్లో 53 పరుగులు అవసరం.
ఈ దశలో శ్రేయస్ గేర్ మార్చి, మనీష్ పాండే తోడుగా భారత్‌ను విజయతీరానికి చేర్చాడు.
15వ ఓవర్ వరకూ శ్రేయస్ 12 బంతులు ఎదుర్కొని (ఒకే ఫోర్‌తో) 16 పరుగులు మాత్రమే చేశాడు.
చివరి ఐదు ఓవర్లలో మాత్రం అతడు 17 బంతులు ఎదుర్కొని 42 పరుగులు బాదాడు. వీటిలో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అతడికే దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
చివర్లో న్యూజీలాండ్‌కు కళ్లెం
న్యూజీలాండ్‌కు ఓపెనర్లు మున్రో, గప్తిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
మొదటి వికెట్ పడే సమయానికి ఆ జట్టు స్కోరు 7.5 ఓవర్లకు 80 పరుగులు.
రెండో, మూడో వికెట్లను న్యూజీలాండ్ స్వల్ప పరుగుల వ్యవధిలోనే కోల్పోయి 12.2 ఓవర్లకు 117 పరుగులతో నిలిచింది.
ఈ దశలో విలియమ్సన్, టేలర్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
షమి వేసిన 16వ ఓవర్‌లో టేలర్ రెండేసి ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే న్యూజీలాండ్‌కు 22 పరుగులు వచ్చాయి. దీంతో స్కోరు 165కు పెరిగింది.
చాహల్ వేసిన తర్వాతి ఓవర్‌లో విలియమ్సన్ కూడా మూడు ఫోర్లు కొట్టాడు. అయితే, చివరి బంతికి కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. న్యూజీలాండ్ స్కోరు 178-4గా మారింది.
ఆ తర్వాత ఆ జట్టు జోరు తగ్గింది.
18వ ఓవర్‌ను బుమ్రా అద్భుతంగా వేశాడు. నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి, సీఫెర్ట్ వికెట్ తీశాడు. చివరి రెండు ఓవర్లూ కలిపి, న్యూజీలాండ్‌కు 21 పరుగులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్‌కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- కుస్తీలో సాక్షీ మలిక్‌నే ఓడించిన ఒక అమ్మాయి కథ
- 'ఆ తెగలో వృద్ధ మహిళలను నరికి చంపేస్తారు. పురుషులకు మరో రకమైన శిక్ష ఉంటుంది'
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









