చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ మధ్య గొడవ ఎందుకొచ్చింది?

ఫొటో సోర్స్, KERALA GOVERNOR @TWITTER
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ భారత ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ మధ్య డిసెంబర్ 29వ తేదీ శనివారం మొదలైన వివాదం ముగిసేలా కనిపించడం లేదు.
గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 80వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు కేరళలోని కన్నూర్ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు.
తను ప్రసంగిస్తున్న సమయంలో ఇర్ఫాన్ హబీబ్ నన్ను శారీరకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని, చికాకు కలిగించారని గవర్నర్ చెప్పారు. న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన "నేను నా ప్రసంగంలో గాంధీ పేరు చెప్పగానే ఇర్ఫాన్ హబీబ్ లేచొచ్చారు. నా వైపు రావాలని ప్రయత్నించారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"నా ఏడీసీ ఆయన్ను ఆపారు. బోర్డు తరఫున వీసీ, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. నా కుడివైపు ఏడీసీ ఉన్నారు. తర్వాత హబీబ్ సోఫా వెనక నుంచి నా వైపు రావాలనుకున్నారు. అక్కడే నిలబడ్డారు. తర్వాత జనం అరవడం, నినాదాలు చేయడం మొదలైంది" అన్నారు.
ఈ ఘటన తర్వాత గవర్నర్ కార్యాలయం నుంచి ఒకేసారి వరుస ట్వీట్లు వచ్చాయి. వాటిలో "ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రారంభ సభలో ఎలాంటి వివాదం జరగలేదు. కన్నూర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దాని 80వ ఎడిషన్‌లో ఇర్ఫాన్ హబీబ్ పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. గవర్నర్ వాటికి సమాధానం ఇచ్చినపుడు ఇర్ఫాన్ హబీబ్ సీటు నుంచి లేచి వచ్చి ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గవర్నర్‌కు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరు చెప్పే ఎలాంటి అధికారం లేదని, ఆయన గాడ్సే పేరు చెప్పాలని అన్నారు" అని పెట్టారు.
కానీ ఈ మొత్తం వివాదంపై ఇర్ఫాన్ హబీబ్ ఏమంటున్నారు. నేను ఆయన స్పందన తెలుసుకోవాలని సోమవారం సాయంత్రం కన్నూర్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఆయనకు ఫోన్ చేశాను.

గాంధీ వద్దు, గాడ్సే గురించి మాట్లాడండి
హబీబ్ నాతో "నేను ఆయన్ను(గవర్నర్‌ను)ఎలా అడ్డుకోగలను. ఆయన చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. నా వయసు 88 ఏళ్లు. నేను ఆయన స్పీచ్ ఇవ్వకుండా ఎలా అడ్డుకోగలను" అన్నారు.
"గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలో నేను కచ్చితంగా ఆపాను. ఆయన అబుల్ కలాం ఆజాద్‌ను, అబ్దుల్ కలామ్ ఆజాద్ అన్నారు. ముస్లింలను మురికిగుంటలో నీళ్లు లాంటి వారన్నారు" అని హబీబ్ చెప్పారు.
"ఇది చాలా రెచ్చగొట్టే ప్రకటన. నేను వీసీతో గవర్నర్‌కు తన ప్రసంగం ముగించమని చెప్పండి అన్నాను"
"వీసీతో చెప్పిన తర్వాత నేను గవర్నర్ వైపు తిరిగాను. ఆయన ఇంకా ఏదంటే అది మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మౌలానా ఆజాద్ గురించి ప్రస్తావించినపుడు, నేను కల్పించుకుని.. మీరు మౌలానా ఆజాద్, గాంధీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గాడ్సే గురించి మాట్లాడండి.. అని కచ్చితంగా చెప్పాను" అని హబీబ్ వివరించారు.
ఇర్ఫాన్ హబీబ్‌ను వామపక్ష చరిత్రకారులుగా చూస్తారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను ఒక ప్రగతిశీల భావజాలం ఉన్న నేతగా భావిస్తారు. కానీ, ఇద్దరి లింకులూ ఒకచోట కలుస్తాయి. అదే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. వీరిద్దరికీ దానితో సంబంధం ఉంది.

ఫొటో సోర్స్, Amu
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నిబంధనల ఉల్లంఘన
నియమాలకు వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగాన్ని సెషన్ మధ్యలో చొప్పించారని హబీబ్ చెప్పారు. నిబంధనల ప్రకారం ఆయన కేవలం 10 నిమిషాలే మాట్లాడాలి, 31 నిమిషాలు కాదు.
‘‘మా సంప్రదాయం ప్రకారం సెషన్‌ను యాక్టింగ్ ప్రెసిడెంట్ ప్రారంభిస్తారు. అది నేనే. ఆయన ఒక చిన్న ప్రసంగం ఇవ్వాలి. ఆ తర్వాత ఇక మీరు ప్రసంగించాలని కాబోయే అధ్యక్షుడికి చెప్పాలి. ’’
అసలు ప్రసంగించకూడని సమయంలో గవర్నర్ ప్రసగిస్తుండడంతో ఇర్ఫాన్ హబీబ్‌కు కోపం వచ్చింది.
సదస్సు హాల్‌ను నాలుగు భాగాలుగా బారికేడ్లు పెట్టారు
గవర్నర్ భద్రతా సిబ్బంది అందరూ ఆ కాన్ఫరెన్స్ హాల్‌ను నాలుగు భాగాలుగా విభజించడంపై కూడా ఇర్ఫాన్ హబీబ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, SHUREH NIYAZI/ BBC
చరిత్ర సమావేశంలో రాజకీయ ప్రసంగం
‘‘ఒక భాగం నుంచి మరో భాగంలోకి ఎవరూ వెళ్లలేకపోతున్నారు. నేను, వేదికపై ఉన్న వారు స్టేజ్ పైకి వెళ్లడానికి కుదరలేదు. దాంతో మాకోసం ఒక బారికేడ్‌ను కాసేపు తెరిచి పెట్టాం.’’
"ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెషన్ 1935 నుంచి జరుగుతోంది. నేను స్వయంగా 1947 నుంచీ అందులో పాల్గొంటున్నాను. కానీ ఇప్పటివరకూ, ఆంగ్లేయుల కాలం నుంచీ చూసినా, భద్రతాసిబ్బంది ఇందులో జోక్యం చేసుకోలేదు" అని ఇర్ఫాన్ హబీబ్ చెప్పారు.
‘‘హిస్టరీ కాన్ఫరెన్స్‌లో భద్రతా సిబ్బందికి ఏం పని.’’
అందుకే బారికేడ్లు తొలగించాలని హబీబ్ వారిని కోరారు కూడా.
"బ్యారికేడ్లు తొలగించకపోతే, మేం గవర్నర్‌తోపాటూ వేదికపై కూచోడానికి వెళ్లమని చెప్పాం. మా పదాధికారులు అందరూ అదే మాట చెప్పారు. మేం వేదికపైకి వెళ్లడం లేదని ఆయనకు తెలీగానే పోలీసులు బారికేడ్లు తొలగించారు. మమ్మల్ని పైకి వెళ్లనిచ్చారు" అని ఇర్ఫాన్ హబీబ్ చెప్పారు.
గవర్నర్ ప్రసంగంతో చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ కోపమొచ్చింది
ఇర్ఫాన్ హబీబ్, ఒక ఎంపీ ప్రసంగించిన తర్వాత గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సెమినార్ చరిత్ర కోసమైతే ఆయన అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
ఇంటర్నెట్ అవసరం గురించి చెప్పాను
గవర్నర్ ఖాన్ మాత్రం తనకు ముందు మాట్లాడినవారు తమ ప్రసంగాల్లో కశ్మీర్, పౌరసత్వ సవరణ చట్టాల గురించి ప్రస్తావించారని అంటున్నారు.
దానికి సమాధానంగా చరిత్రకారులకు రీసెర్చ్ అవసరమని, దానికోసం ఇంటర్‌నెట్ సౌకర్యాలు అవసరం అని మాత్రమే నేను చెప్పానని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.
"నేను నా ప్రసంగంలో కశ్మీర్‌లో నాలుగు నెలల నుంచి ఇంటర్‌నెట్‌పై నిషేధం ఉంది. అలాంటప్పుడు చరిత్రకారులు తమ పని ఎలా చేస్తారు, తమ రీసెర్చ్ ఎలా పూర్తి చేయగలరు అన్నాను" అని చెప్పారు.
సెమినార్‌కు వచ్చిన చాలామంది గవర్నర్‌ను వ్యతిరేకించారు. ఇర్ఫాన్ హబీబ్‌ను సమర్థిస్తున్నట్లు కనిపించారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 3564 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
- భారత్‌లోకి దిగుమతి అవుతున్న 66 శాతం బొమ్మలతో పిల్లలకు ప్రమాదం
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








