మహారాష్ట్ర: ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రే ఎన్నిక.. ఫడణవీస్ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తానని వ్యాఖ్య

ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర తదుపరి సీఎం కావడానికి రంగం సిద్ధమైంది.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశమయ్యారు. వీరంతా ఉద్ధవ్ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మా కూటమికి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా నేతృత్వం వహించాలని మేం కోరుకుంటున్నాం అని ఈ సమావేశం అనంతరం ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

"ఉద్ధవ్ ఠాక్రే మూడు పార్టీల కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈరోజే గవర్నర్‌ను కలుస్తారు. డిసెంబర్ 1న ముంబయి లోని శివాజీ పార్కులో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది" అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.

సమావేశంలో ప్రసంగించిన ఉద్ధవ్... దేవేంద్ర ఫడణవీస్ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. "నేను ఎవ్వరికీ భయపడను. అబద్ధాలు చెప్పడం హిందుత్వలో ఉండదు. మీకు అవసరమైనప్పుడు మాతో చెలిమి చేశారు. అవసరం తీరగానే వదిలేశారు. మమ్మల్ని దూరం పెట్టాలని ప్రయత్నించారు" అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.

"నేను రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సోనియాగాంధీకి, మద్దతునిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంచుకుంటూ మేం దేశానికి కొత్త దిశను నిర్దేశిస్తాం" అని ఆయనన్నారు.

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా

అంతకుముందు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే పదవి నుంచి తప్పుకున్నారు.

దేవేంద్ర ఫడణవీస్ బుధవారంనాడు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన కాసేపటికే ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"గత ఐదేళ్లలో మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు తమ తీర్పును వెల్లడించారు. శివసేన-బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠం పంచుకోవాలనే హామీని బీజేపీ...శివసేనకు ఇవ్వలేదు. అధికారం కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన చేతులు కలిపింది. హిందుత్వ వాదాన్ని వదిలి అధికారం కోసం వారితో జట్టుకట్టింది" అని దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యానించారు.

ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు.

"మేం ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరిపామని ఆరోపించారు. మేమెప్పుడూ అలాంటి చర్యలకు పాల్పడలేదు."

వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అజిత్ పవార్ తనతో చెప్పారని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.

కాసేపట్లో నేను గవర్నర్‌ను కలిసి నా రాజీనామాను సమర్పిస్తాను అని ఫడణవీస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ తర్వాత నేరుగా గవర్నర్ నివాసానికి వెళ్లి తన రాజీనామా లేఖను అందచేశారు.

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, ANI

పేదలు, రైతులు, అణగారిన వర్గాల కోసం మేం అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని చెప్పారు.

"మా మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం. కానీ దానికి మా బలం సరిపోదని తెలిసింది. అందుకే రాజీనామా చేస్తున్నా.

ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఎంత వరకూ స్థిరంగా ఉంటుందో నాకు అనుమానమే, కానీ మేం మాత్రం ఓ బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

అజిత్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

అజిత్ పవార్ రాజీనామా

దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా ప్రకటనకు కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ కూడా రాజీనామా చేశారు.

రేపు ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌లతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.

బలనిరూపణకు గవర్నర్ వారికి 7 రోజుల గడువిచ్చారు.

దీనిపై ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వెంటనే బలనిరూపణకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి.

మహారాష్ట్ర రాజకీయ ఘటనాక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చెబుతూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించాయి. దీనిపై ఆదివారం ప్రారంభమైన విచారణ సోమవారం కూడా కొనసాగింది. అన్ని పార్టీల వాదనలు విన్న సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం తన ఆదేశాలను జారీచేసింది.

అసలేం జరిగింది?

మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తరువాత సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.

ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనలు రెండింటికీ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈలోగా అసెంబ్లీ గడువు పూర్తవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది.

దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన ప్రయత్నాలు చేసింది.

ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకముందే శనివారం ఉదయం ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో ఆగమేఘాల మీద బీజేపీ, ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాయి.

శనివారం ఉదయం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వీరిని ఆహ్వానించడం, వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇది ప్రజాస్వామ్య విజయం: కాంగ్రెస్

దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌ల రాజీనామాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

ఇది ప్రజాస్వామ్య విజయం అని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.

"ఎమ్మెల్యేలను కొనడం ద్వారా తాము బలపరీక్షలో నెగ్గవచ్చని వాళ్లు భావించారు. ఇది కేవలం దేవేంద్ర ఫడణవీస్ పరాజయం మాత్రమే కాదు, దిల్లీలో కూర్చున్న ఆయన అధినాయకత్వానికి చెంపపెట్టు" అని వేణుగోపాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)