మహారాష్ట్ర: దేవేంద్ర ఫడణవీస్ బలపరీక్ష రేపే... సుప్రీం కోర్టు ఆదేశం

ఫడణవీస్

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్ రేపు(నవంబరు 27) సాయంత్రం 5 గంటలలోగా బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తీర్పులో ముఖ్యాంశాలు

* నవంబరు 27 సాయంత్రం 5 గంటల్లోగా ఓపెన్ సీక్రెట్ బ్యాలట్ విధానంలో బల పరీక్ష జరపాలి.

* ఆలోగా ప్రోటెం స్పీకరును నియమించాలి.

* బలపరీక్ష కోసం శాసనసభను సమావేశపరచాలి.. సమావేశ అజెండా బలపరీక్ష ఒక్కటే కావాలి.

* మొత్తం ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

గత నాలుగు రోజుల్లో

బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్నాక ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

తొలుత న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు విన్నది.

కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌లకు కోర్టు శనివారమే నోటీసులు జారీ చేసింది. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖ ప్రతులను, ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన పత్రాలను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా తమకు అందించాలని సొలిసిటర్ జనరల్ తుహార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.

సోమవారం వాటిని పరిశీలించి వాదనలు విన్నాక మంగళవారం ఉదయం 10.30కి తీర్పు వెలువరిస్తామని కోర్టు చెప్పింది.

ఫడణవీస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ ఏర్పాటుపై..

మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తరువాత ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ రాలేదు.

ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనలు రెండింటికీ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈలోగా అసెంబ్లీ గడువు పూర్తవడంతో రాష్ట్రపతి పాలన ఏర్పడింది.

దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన ప్రయత్నాలు చేసింది.

ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకముందే శనివారం ఉదయం ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు పలికారు. దీంతో ఆగమేఘాలమీద బీజేపీ, ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాయి.

శనివారం ఉదయం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వీరిని ఆహ్వానించడం, వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)