IND Vs SA రెండో టెస్టు: దక్షిణాఫ్రికాను భారత్ ఫాలో ఆన్ ఆడిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
పుణెలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై కోహ్లీ సేన పట్టు బిగించింది.
ఆతిథ్య భారత్ తొలి ఇన్నింగ్స్ 601 పరుగులకు సమాధానంగా దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టడంతో భారత జట్టుకు 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దక్షిణాఫ్రికా ఆలౌట్ అవడంతోపాటు 3వ రోజు ఆట కూడా ముగియడంతో, నాలుగో రోజైన ఆదివారం భారత్ ఆ జట్టును ఫాలో-ఆన్ ఆడిస్తుందా, లేక అలిసిపోయిన బౌలర్లకు విశ్రాంతి ఇవ్వడానికి సెకండ్ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటుందో ఇంకా స్పష్టత రాలేదు.
మూడు వికెట్ల నష్టానికి 36 పరుగులతో మూడో రోజు ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 53 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 72
కానీ కెప్టెన్ డుప్లెసిస్ (64), వికెట్ కీపర్ డికాక్ (31) జట్టు స్కోరును ముందుకు నడిపించి వంద దాటించారు.
దక్షిణాఫ్రికా స్కోరు 162 దగ్గర ఉన్నప్పుడు డుప్లెసిస్ ఔటైనా, బౌలర్లు ఫిలాండర్, కేశవ్ మహరాజ్ నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును 270 పరుగులు దాటించగలిగారు.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 72 పరుగులు చేయగా అతడికి అండగా నిలిచిన ఫాస్ట్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ 44 పరుగులతో చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు.
జట్టులో ఈ నలుగురు మినహా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
భారత బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్ 3, మహమ్మద్ షమీ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
- రోహిత్ శర్మ: టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ బ్రేక్
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- గుర్తింపు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఆటపైనే నా దృష్టి: కోనేరు హంపి
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- సెప్టెంబర్ 17: విలీనమా? విమోచనా?... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి?- అభిప్రాయం
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- హార్దిక్ పటేల్: ‘పటేళ్లలో సింహం’
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








