భారత్ Vs దక్షిణాఫ్రికా: మయాంక్ అగర్వాల్ సెంచరీ.. పుజారా, కోహ్లీ అర్ధ శతకాలు..

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఈ రోజు సెంచరీ కొట్టాడు. చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ శతకాలతో రాణించారు.
మయాంక్ 183 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు. 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పుడు భారత్ స్కోరు 198 పరుగులు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన మొదటి టెస్టులో సాధించిన విజయంతో టీమిండియా పుణెలో గురువారం ఉత్సాహంగా బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి టెస్టులో రెండు సెంచరీలతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ, ఈ రోజు 14 పరుగులకే వెనుదిరిగాడు.
రోహిత్ గత మ్యాచ్లో అసాధారణ ప్రదర్శనతో, 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా దిగిన మొదటి టెస్టులోనే రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు.
రోహిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ సాధించాడు. అతడు 112 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి, నిష్క్రమించాడు.
మయాంక్, పుజారా, రోహిత్ ముగ్గురూ రబడ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు.
విరాట్ కోహ్లీ 63 పరుగుల(పది ఫోర్లు)తో, అజింక్య రహానే 18 పరుగుల(మూడు ఫోర్లు)తో నాటౌట్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- క్రికెట్: ఇంగ్లండ్‌లో భారత జట్టు విజయాలను చేజార్చుకోవడానికి నాలుగు కారణాలు
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- మొండిపాలెంలో పెరుగుతున్న కిడ్నీ రోగులు... ఇది మరో ఉద్దానమా?
- టొమాటోలు తింటే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందా?
- బంగ్లాదేశ్ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?
- తెలంగాణ ఆర్టీసీ సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలేంటి? యూనియన్లు, ప్రభుత్వం ఏమంటున్నాయి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








