'బాలాకోట్ దాడుల మరునాడు మన హెలికాప్టర్‌ను మనమే కూల్చేయడం 'పెద్ద తప్పు'... బాధ్యులపై చర్య తీసుకుంటాం' - ఎయిర్ చీఫ్ భదౌరియా

ఆర్ కె ఎస్ భదౌరియా

ఫొటో సోర్స్, Indian Airforce / Facebook

ఫొటో క్యాప్షన్, ఆర్ కె ఎస్ భదౌరియా

శ్రీనగర్ వద్ద ఆరుగురు సిబ్బంంది ఉన్న ఎంఐ-17 హెలికాప్టర్‌ భారత వైమానిక దళం ప్రయోగించిన క్షిపణి తగిలి కుప్పకూలిందని దానికి బాధ్యులైన వారిపై తప్పనిసరిగా చర్య తీసుకుంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా శుక్రవారం వెల్లడించారు.

"అది మా తప్పే. మన మిసైల్‌తో మన హెలికాప్టర్‌నే పేల్చేశాం. అందుకు బాధ్యులైన ఇద్దరు అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అది మేం చేసిన పెద్ద తప్పు అని అంగీకరిస్తున్నాం. అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త వహిస్తామని హామీ ఇస్తున్నాం" అని ఎయిర్ ఫోర్స్ వార్షికోత్సవం నాడు భదౌరియా చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో తీవ్రవాదుల లక్ష్యాలపై భారత్ దాడులు జరిపిన మరునాడు ఎం.ఐ-17 హెలికాప్టర్‌ కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ఈ హెలికాప్టర్‌ను బద్గాం వద్ద డీకొంది.

ఈ సందర్భంగా ఐఏఎఫ్ సాధించిన విజయాలతో కూడిన వీడియోను విలేఖరుల సమావేశం ప్రారంభంలో చూపించారు. అందులో బాలాకోట్ మీద దాడులు జరిపిన తీరును కూడా చూపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"భారత వైమానిక దళం ఇటీవలి కాలంలో ఎన్నో మైలురాళ్ళు అధిగమించింది. ఫిబ్రవరి 26న మేం బాలాకోట్‌లోని టెర్రర్ క్యాంపులపై విజయవంతంగా దాడులు జరిపాం. ఫిబ్రవరి 27న పాకిస్తాన్ గగనతల దాడులకు పాల్పడిన తరువాత చేసిన పోరులో భారత వైమానిక దళం ఒక మిగ్-21 యుద్ధ విమానాన్ని కోల్పోయింది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానం పేలిపోయింది." అని భదౌరియా తన మొదటి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

వైమానిక దళ ప్రధానాధికారి ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు కూడా చేశారు. " పాకిస్తాన్‌కు ఎలాంటి బదులివ్వడానికైనా ఐఏఎఫ్ సిద్ధంగా ఉంది. ఆ దేశం నుంచి తీవ్రవాద దాడులేమైనా జరిగితే ప్రభుత్వం నిర్ణయం ప్రకారం సత్వరమే బదులిస్తాం" అని ఆయన అన్నారు.

బాలాకోట్ మ్యాప్

కొత్తగా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ రఫేల్ ఎస్-400 వైమానిక దాడుల ఆయుధ వ్యవస్థతో భారత వాయు సేన బలం గణనీయంగా పెరిగిందని కూడా బధౌరి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)