కశ్మీర్ వివాదం పరిష్కారంలో మెహబూబా ముఫ్తీ ప్రధాన అజెండా ఏమిటి

మెహబూబా

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెల్లెలు రుబియాను ఒకసారి మిలిటెంట్లు బంధించారు. మిలిటెంట్ల చెర నుంచి రుబియాను విడిపించడానికి భారత ప్రభుత్వం నలుగురు మిలిటెంట్లను విడుదల చేయాల్సివచ్చింది.

మెహబూబా ముఫ్తీ.. కశ్మీర్ సీనియర్ రాజకీయ నాయకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె. ఈమె రాజకీయ ప్రస్థానం 1996లో ప్రారంభమైంది. మెహబూబా.. బిజ్‌బిన్హరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచారు.

59 సంవత్సరాల మెహబూబా ముఫ్తీ ఎల్ఎల్‌బీ చదివారు. కశ్మీర్ వివాదం గురించి, తమ పార్టీ విధానాల గురించి ఓసారి మీడియాతో మాట్లాడుతూ..

‘‘కశ్మీర్ వివాద పరిష్కారానికి పాకిస్తాన్‌తో, హురియత్‌తో చర్చలు జరపడం ద్వారా కొత్త ద్వారాలను తెరవాలి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు, పవర్ ప్రాజెక్టును తిరిగి తీసుకురావడం.. ఇది పీడీపీ ఎన్నికల అజెండా కాదు, ఇదే మా ప్రాథమిక అజెండా. వీటికోసమే మేం నిరంతరం పనిచేస్తున్నాం’’ అన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: మెహబూబా ముఫ్తీ

మెహబూబా గురించి మరిన్ని వివరాలు, విశేషాలు...

1999లో మెహబూబా ముఫ్తీ కాంగ్రెస్ పార్టీని వీడి, తన తండ్రి స్థాపించిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలో చేరారు.

2002లో దక్షిణ కశ్మీర్ ప్రాంతం నుంచి పోటీ చేసి, భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2014లో బీజేపీతో కలిసి, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా కశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2016లో తండ్రి మరణంతో, మెహబూబా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవలేదు.

2018 జూన్‌లో బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం మెహబూబా అనంత్‌నాగ్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టే, ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మెహబూబా రాజకీయ జీవితంలో కీలకంగా మారాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)