కర్నాటక సంక్షోభం: కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందా? ఎవరి పాత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కర్నాటక రాజకీయాల్లో మరోసారి గందరగోళం ఏర్పడింది. జులై 12 శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ తలెత్తిన ఈ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది.
ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం ఉంటుందా? కూలుతుందా అన్నది కొద్దిరోజుల్లేనే తేలనుంది.
కుర్చీని కాపాడుకోవడానికి ఒకరు.. లాగేసుకోవడానికి మరొకరు బెంగళూరు వీధులు, ముంబయి, సుప్రీంకోర్టు వేదికగా పోరాడుతున్నారు.
ఇలాంటి తరుణంలో ఏం జరగొచ్చు..? ఈ వ్యవహారంలో స్పీకరు, గవర్నరు, సీఎం, సుప్రీంకోర్టు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయో ముందుముందు తెలియనుంది.
శాసనసభాపతి పాత్రేమిటి?
- రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలలో ముగ్గురిని జులై 12న తన ముందు హాజరుకావాలని స్పీకర్ రమేశ్ కుమార్ కోరారు. రో ఇద్దరిని జులై 15న తన ముందు హాజరుకమ్మన్నారు. ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా వారు రాజీనామా చేస్తున్నారని తెలుసుకోవడానికి ప్రిసైడింగ్ అధికారి ముందు హాజరుకావడమనేది తప్పనిసరి.
- రాజీనామాలను ఆమోదించడం, తిరస్కరించడమనేది స్పీకరు నిర్ణయం. అయితే.. తన ముందు హాజరుకావాలని స్పీకరు కోరిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులు. దీంతో వారు రాజీనామాలు ఉపసంహరించుకునే అవకాశాలూ ఉన్నాయి. అనర్హత వేటు పడే అవకాశాలుండడంతో రాజీనామాలు ఉపసంహరించుకోవచ్చు.
- రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే.. ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోతే వాటిని ఆమోదించకపోవచ్చు.
- రాజీనామాలపై ఇంత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఏమీ లేదు. దీంతో స్పీకర్ వాటిని తొక్కిపెట్టనూవచ్చు.
గవర్నరు పాత్రేమిటి?
- రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, బీజేపీ విజ్ఞాపన నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రిని గవర్నరు కోరొచ్చు.
- అసెంబ్లీని కొద్దికాలం పాటు తాత్కాలికంగా రద్దు చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు..
- స్పీకరు అధికారాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం సుప్రీంకోర్టు పరిధిలో లేదు. రాజీనామాలు ఆమోదించాలని కానీ, వద్దని కానీ స్పీకరును సుప్రీంకోర్టు ఆదేశించలేదు.
- ఈ కేసులు విచారించే సమయంలో సుప్రీంకోర్టు పరిశీలనలను పార్టీలు రాజకీయ క్షేత్రంలో పోరాటంలో వాడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపూర్
- ప్రపంచ కప్ 2019: సెమీస్ ఆడకుండానే టీమిండియా ఫైనల్ చేరుకోవచ్చా
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?
- క్రికెట్ వరల్డ్కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్నే ఎందుకు ఎంచుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




