NEFT, RTGS నగదు బదిలీలపై జూలై 1 నుంచి ఛార్జీలు ఉండవు - ఆర్బీఐ

ఫొటో సోర్స్, Getty Images
జూలై 1వ తేదీ నుంచి ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా జరిపే నగదు బదిలీలపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.
ఈ మేరకు ఈరోజు (జూన్ 11వ తేదీ మంగళవారం) బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ (ఎన్‌ఈఎఫ్‌టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సేవలను ఉపయోగించుకుని నగదు బదిలీ జరిపితే ఇప్పటి వరకూ ఆయా బ్యాంకుల నుంచి ఆర్బీఐ కొంత రుసుము వసూలు చేస్తోంది.
అయితే, 2006లో ప్రవేశపెట్టిన సేవల ఈ వ్యవస్థ, రుసుము చెల్లింపులపై కొన్ని బ్యాంకులు గత కొద్ది సంవత్సరాలుగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, RBI
ఆర్టీజీఎస్ ద్వారా రూ. 5 లక్షల వరకూ నగదు పంపితే ఒక్కో బదిలీపై గరిష్ఠంగా రూ.30, రూ.5 లక్షల కంటే మించి నగదు పంపితే గరిష్ఠంగా ఒక్కో బదిలీపై రూ.55 వసూలు చేస్తున్నారు.
నగదును బదిలీ చేస్తున్న బ్యాంకు ఈ రుసుమును ఖాతాదారుడి నుంచి వసూలు చేస్తోంది.
కానీ, నగదును స్వీకరించిన బ్యాంకుకు కానీ, ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ వ్యవస్థలను నిర్వహించే సంస్థలకు కానీ ఈ రుసుము నుంచి చెల్లించాల్సిన నిర్వహణ వ్యయాలను అందించటం లేదని తమకు ఫిర్యాదులు అందాయని ఆర్బీఐ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన జరిగిన సమావేశంలో ఈ సేవల ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములను ఎత్తివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీలు బాగా పెరిగాయని, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీలు, చెల్లింపులకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసేందుకు గాను ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ సేవలపై విధిస్తున్న రుసుములను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాము కల్పించిన ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేయాలని, అన్ని బ్యాంకులు జూలై 1వ తేదీ నుంచి ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా నగదు బదిలీలు జరిపే ఖాతాదారుల నుంచి కూడా ఎలాంటి రుసుములూ వసూలు చేయొద్దని ఆర్బీఐ ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రా సరిహద్దులో రీనోలు: ఈ తెగలో హత్య నేరం కాదు.. సెక్స్‌కు పట్టింపుల్లేవు
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
- కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణల్లోకి ఎప్పుడొస్తాయి?
- రూపాయి పతనం: సామాన్యుడు ఆర్బీఐ నుంచి ఏం ఆశించవచ్చు?
- శ్రీలంక ముస్లింల అసాధారణ చర్య.. హింసాత్మక అతివాదులను దూరం పెట్టేందుకు మసీదు కూల్చివేత
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- రిజర్వు బ్యాంకుకూ కేంద్రానికీ మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది?
- ‘ఆర్బీఐకి ప్రభుత్వాన్ని ఎదిరించే హక్కు ఉండదు’
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- మీ డెబిట్ కార్డు ఇక నుంచి పని చేస్తుందా ? చేయదా?
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
- ఏడాదిలో నెల రోజులు మాత్రమే కనిపించే గ్రామం ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








