మీ డెబిట్ కార్డు ఇక నుంచి పని చేస్తుందా ? చేయదా?

మీరు వినియోగిస్తున్న డెబిట్ (ఏటీఎం) కార్డు, క్రెడిట్ కార్డు మీద మొబైల్ సిమ్ కార్డులాంటి చిప్ ఉందో లేదో చూసుకోండి. ఆ చిప్ లేని ఎస్‌బీఐ కార్డులు 2018 డిసెంబర్ 31 తర్వాత పనిచేయవు.
నకిలీ కార్డుల మోసాలను అరికట్టేందుకు భద్రతతో కూడిన ఈఎంవీ చిప్‌లతో కూడిన కార్డులను జారీ చేయాలని దేశంలోని అన్ని బ్యాంకులనూ 2015లో ఆర్‌బీఐ ఆదేశించింది.
పాత కార్డులకు వెనక భాగంలో ఒక నల్లని మాగ్నటిక్ పట్టీ(స్ట్రిప్) ఉంటుంది. ఆ పట్టీలో వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.
డబ్బులు తీసుకునేందుకు ఆ కార్డును ఏటీఎంలో పెట్టినప్పుడు ఆ పట్టీలోని సమాచారాన్ని మెషీన్ స్కాన్ చేసి, ఆ వివరాల ఆధారంగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. అది ఏమాత్రం సురక్షితం కాదు.
నేరగాళ్లు ఏటీఎంలలో రహస్యంగా స్కిమ్మర్లను ఏర్పాటు చేసి వినియోగదారుల కార్డుల వివరాలను తస్కరించి, నకిలీ కార్డులు సృష్టిస్తారు. అలా నకిలీ కార్డులతో డబ్బులు కాజేసిన పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈఎంవీ కార్డులు ఎందుకు?
ఈఎంవీ(యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా) చిప్‌లు కలిగిన కొత్త కార్డుల నుంచి అలా వివరాలను తస్కరించడం అంత సులువు కాదు. ఈ చిప్‌లలో వినియోగదారుల ఖాతాల సమాచారం ఎవరూ అర్థం చేసుకోలేని కోడ్ భాషలోకి మార్చి (ఎన్‌క్రిప్ట్) ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
నకిలీ కార్డుల మోసాలను అరికట్టేందుకు వినియోగదారులందరికీ 2018 డిసెంబర్ 31లోగా ఈఎంవీ చిప్ కార్డులు అందేలా చూడాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.
దాంతో బ్యాంకులు పాత కార్డులను వెనక్కి తీసుకుని కొత్తవాటిని ఇస్తున్నాయి.
చిప్ కార్డు కావాలంటే మీకు ఖాతా ఉన్న బ్రాంచికి వెళ్లాలి. లేదా ఎస్‌బీఐ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- యమునా నదిలో ఈ విషపూరిత నురగ ఎందుకొస్తోంది?
- #BBCSpecial: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం
- వాయు కాలుష్యం: హైదరాబాద్‌లో ఉంటే.. రోజుకు రెండు సిగరెట్లు తాగినట్లే
- టాయిలెట్ కట్టించని తండ్రిని అరెస్ట్ చేయమన్న కూతురు
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








