రోబో చేతి మద్యం తాగాలంటే ఆ బార్‌కు వెళ్లాల్సిందే
సాయంత్రం వేళ తెగ సందడిగా ఉంది ఆ బార్. టేబుళ్లన్నీ కస్టమర్లతో నిండిపోయాయి. ఎవరు ఏం ఆర్డర్ చేసినా బార్‌టెండర్లు చకచకా తెచ్చి అందిస్తున్నారు.
కాక్‌టైల్ ఆర్డర్ చేసినా క్షణాల్లో వచ్చి వాలుతోంది.
ఇంత వేగం ఎలా సాధ్యం?
దీనికి కారణం.. రెండు రోబోలు. అవును.. ఆ బార్‌లో రెండు రోబోలు కస్టమర్లకు కోరుకున్న మద్యం తెచ్చి అందిస్తాయి. అక్కడ అవే ప్రధాన బార్‌టెండర్లు.

ఫొటో సోర్స్, facebook/tipsyrobot
రెండు రోబోలు
అక్కడ మీ ఆర్డర్లను రోబోలే తీసుకుంటాయ్. వోడ్కా, విస్కీ వంటివి మాత్రమే కాదు క్లాసిక్ మార్టిని, పవర్‌ఫుల్ టకీలా వంటి కాక్‌టెయిల్స్‌ను కూడా మీ ముందుంచుతాయ్.
లాస్ వేగాస్‌లోని "ద టిప్సీ రోబో" బార్‌లో అడుగు పెడితే ఈ దృశ్యాలు కనిపిస్తాయి.
అక్కడ రెండు రోబోలు క్షణం తీరిక లేకుండా ఈ పనిలో నిమగ్నమై ఉంటాయి.

ఫొటో సోర్స్, facebook/tipsyrobot
గంటకు 120 డ్రింక్స్
కస్టమర్లు కంప్యూటర్ ద్వారా ఆర్డర్ చేస్తే సరి. క్షణాల్లో కావాల్సిన డ్రింక్‌ను అందిస్తాయి ఇవి.
ఈ రోబోలు గంటకు 120 డ్రింక్స్ తయారు చేస్తాయని, కేవలం 60-90 సెకన్లలో ఒక కాక్‌టెయిల్‌ను మీ ముందు ఉంచుతాయని సంస్థ చెబుతోంది.
నిన్న హోటళ్లో సర్వర్లు.. నేడు బార్లలో టెండర్లు.. రేపు రోబోలు ఇంకేం పనులు చేస్తాయో చూడాలి మరి!
ఇవి కూడా చదండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









