డ్రగ్స్‌పై పంజాబ్ పోరాటం ఎంత వరకు వచ్చింది?

డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అర్వింద్ ఛాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొన్నేళ్లుగా పంజాబ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల సమస్య పట్టి పీడిస్తోంది. అధికారంలోకొచ్చే ప్రతి పార్టీ కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉంటున్నాయి. ఎన్నికలొచ్చే ప్రతి సారీ ఎక్కువగా వార్తల్లోకొచ్చేది ఈ మాదక ద్రవ్యాల అంశమే.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ డ్రగ్స్ అంశం వార్తల్లో నిలిచింది. డ్రగ్స్ సమస్య ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

పంజాబ్‌లో లూధియానా జిల్లాలోని బేట్ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా మత్తుపదార్థాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ మత్తు పదార్ధాలను అమ్మేవాళ్లకు, కొనే వాళ్ళకు ఎప్పుడూ కొరత ఉండదని చెబుతుంటారు స్థానికులు.

వీడియో క్యాప్షన్, వీడియో: పంజాబ్‌‌లో డ్రగ్స్ సమస్య ఇప్పుడు ఎలా ఉంది?

డ్రగ్స్ బాధిత కుటుంబాల్లో మాల్సియన్ బజాన్ గ్రామానికి చెందిన గుర్‌దీప్ సింగ్‌ కుటుంబం ఒకటి.

ఆయన కుమారుడు జనవరిలో డ్రగ్స్ వల్లే చనిపోయాడు. అప్పుడు అతడికి 19 ఏళ్లు.

"మాదక ద్రవ్యాల కారణంగానే వాడు చనిపోయాడు. తరచూ ఇంజెక్షన్లు తీసుకునేవాడు" అని గుర్‌దీప్ బీబీసీతో చెప్పారు.

డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

మాదక ద్రవ్యాల సమస్యను విజయవంతంగా తగ్గించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది.

మత్తుమందులపై యుద్ధం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్తున్నారు.

ఇప్పటికే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న దాదాపు 26 వేల మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్తున్నారు.

డ్రగ్స్ అక్రమ సరఫరాదారులతో భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

గతంతో పోలిస్తే ఇప్పుడు మాదక ద్రవ్యాలను కొనడం కాస్త కష్టంగా మారినప్పటికీ అవి ఇంకా అందుబాటులోనే ఉన్నాయని బీబీసీ పరిశోధనలో తేలింది. ఇప్పటికీ ప్రజలు మాదక ద్రవ్యాలను వాడుతూనే ఉన్నారు.

డ్రగ్స్ సమస్యను అరికట్టామని ప్రభుత్వాలు చెప్పే మాటల్లో నిజం లేదన్నది గుర్‌దీప్ మాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)