ఆశారాం బాపు కుమారుడికి యావజ్జీవ కారాగారం.. అత్యాచారం కేసులో శిక్ష విధించిన కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, అత్యాచార కేసులో నిందితుడు ఆశారాం బాపు తనయుడు నారాయణ సాయికి గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
తండ్రిలాగే నారాయణసాయి కూడా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసులోనే కోర్టు యావజ్జీవ శిక్ష విధించడంతో పాటు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఈ కేసులో నారాయణ సాయి వ్యక్తిగత సహాయకులు గంగ, జమున, వంటమనిషి హనుమాన్‌లకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.
నారాయణ సాయి డ్రైవర్ రమేశ్ మల్హోత్రాకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యాచారం
సూరత్‌కే చెందిన బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 27న నారాయణ సాయిని దోషిగా ప్రకటించింది. ఈ రోజు శిక్ష ఖరారు చేసింది.
2002 నుంచి 2005 మధ్య అప్పటికి మైనర్లుగా ఉన్న ఇద్దరు బాలికలపై నారాయణ సాయి అత్యాచారానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. దీనిపై బాధితులు 2013లో కేసు పెట్టారు.
కాగా నారాయణ సాయి తండ్రి ఆశారాంబాపుపైనా అనేక ఆరోపణలున్నాయి. తన శిష్యురాలిపైనే ఆయన అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








