ప్రియాంకా గాంధీ: కార్యకర్తల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటారు
అది 1988వ సంవత్సరం. ఇందిరా గాంధీ హత్యకు గురై నాలుగేళ్లు అవుతోంది. అప్పుడు ఓ వేదిక మీద ప్రియాంకా గాంధీని ప్రజలు చూశారు.
అప్పటికి ప్రియాంక వయసు 16 ఏళ్లు. బహిరంగ సభలో ఆమె ప్రసంగించడం అదే తొలిసారి. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న డిమాండ్ 31 ఏళ్లకు నెరవేరింది.
ప్రియాంక 1972 జనవరి 12న జన్మించారు. దిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో చదుకున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో మానసిక శాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత బుద్ధిస్ట్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను తొలిసారి కలిసినప్పుడు ప్రియాంకా గాంధీకి 13 ఏళ్లు. 1997లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రియాంక గాంధీ యుక్తవయసులో ఉన్నప్పుడు తన తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి రాయబరేలీకి వెళ్లేవారు. అప్పుడు ఆమె జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ఉండేవారు.
అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు గ్రామస్తులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకను కూడా 'భయ్యా' అని పిలిచేవారు. ఆ తర్వాత రానురాను 'భయ్యా జీ' అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. ఆమె హెయిర్ స్టైల్ వల్ల ఆమెకు ఈ పేరొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె మొదటిసారిగా 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ కోసం ప్రచారం చేశారు.
అప్పుడు, ప్రచారం కోసం నెలరోజుల పాటు రాయ్‌బరేలీలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. పిల్లలను ఇంట్లో వదిలేసి, రోజూ ఉదయాన్నే ఆమె ప్రచారానికి వెళ్లేవారు. రాత్రి పొద్దుపోయాక తిరిగి ఇంటికి వచ్చేవారు.
ప్రియాంక 2019లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలా ఆమె లాంఛనంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
ఆమె పార్టీ కార్యకర్తలను పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రియాంక ప్రవేశం పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని పెంచింది.
ఇవి కూడా చదవండి:
- ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?
- శ్రీలంక పేలుళ్లు: ‘నిఘా హెచ్చరికలు నాకు అందలేదు’ - ప్రధాని విక్రమసింఘే
- సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎందుకు? కేసులు ఏమిటి?
- లోక్‌సభ ఎన్నికలు 2019: పార్టీలన్నీ సోషల్ మీడియాపై ఎందుకు దృష్టిసారిస్తున్నాయి?
- మీ ఆలోచనల్ని చదివి, మాటల రూపంలో వినిపించే పరికరం... శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
- ఒకప్పటి బార్ డ్యాన్సర్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి
- మోదీపై ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయట్లేదు?
- Fact Check: ప్రకాశ్ రాజ్ క్రైస్తవ మతంలోకి మారడం నిజమేనా, వాస్తవం ఏంటి?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









