బురఖా వేసుకున్న మహిళను ఓటు వేయకుండా బీజేపీ కార్యకర్త అడ్డుకున్నారా :Fact Check

ఫొటో సోర్స్, SM VIRAL VIDEO
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్ నియోజకవర్గంలో బురఖాతో ఉన్న కొందరు మహిళల నుంచి ఒక బీజేపీ మహిళా కార్యకర్త నకిలీ ఆధార్ కార్డులు లాక్కున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గురువారం తొలి దశ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మే 23న ఫలితాలు ప్రకటించనున్నారు.
"బురఖాలు వేసుకున్న కొందరు మహిళలు దొంగ ఓట్లు వేశారని" ముజఫర్‌నగర్ బీజేపీ అభ్యర్థి సంజీవ్ బల్యాన్ అన్నారు.
వేల సార్లు షేర్ అయిన ఈ వీడియోను ట్విటర్, ఫేస్‌బుక్‌లో కొన్ని వేల మంది చూశారు.

ఫొటో సోర్స్, Vikas Pandey
'బీజేపీ మిషన్ 2019', 'వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ' లాంటి రైట్ వింగ్ ఫేస్‌బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
కానీ, ఈ వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని మేం గుర్తించాం.
వాస్తవం ఏంటి..
ఈ వైరల్ వీడియోతోపాటు "బురఖా వేసుకుని దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలను బీజేపీ ముస్లిం మహిళా కార్యకర్త పట్టుకున్నారు" అని రాశారు.
ఈ వీడియోలో మాటలను జాగ్రత్తగా వింటే.. అందులో ఒక మహిళ "నేను బీఎస్పీ అభ్యర్థి షైలాను, ఆ మహిళలను నేను ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపించను. నిజం చెప్పండి. మీకీ ఆధార్ కార్డులు ఎవరిచ్చారు" అంటుంటారు.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం 2017లో బీఎస్పీ ఫ్యాషన్ డిజైనర్ షైలా ఖాన్‌ను రాంపూర్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవికి నిలిపింది. ఉత్తర్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు 2017 నవంబర్‌లో జరిగాయి.

ఫొటో సోర్స్, Vikas Pandey
ఈ వైరల్ వీడియోను యూపీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ఒక రోజు తర్వాత అంటే 2017 నవంబర్ 27న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
ఇందులో ఆరోపించినట్లు మాకు ఎలాంటి వార్తా కథనాలు కనిపించలేదు. కానీ ఈ వీడియో కచ్చితంగా 2019లో తీసింది కాదు. దీనిని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినదని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు
తొలి దశ ఎన్నికల్లో ఈవీఎంలను తగలబెట్టారంటూ ఇంకో వీడియోను కూడా విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
35 సెకన్ల ఈ క్లిప్‌లో జనం ఈవీఎంలను నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం, వాటిని తొక్కడం తర్వాత తగలబెట్టడం కనిపిస్తుంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1

ఫొటో సోర్స్, Vikas Pandey
ఈ వీడియోను రెండు వేర్వేరు ప్రాంతాలవని చెబుతున్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
ఆ వీడియోతోపాటు "మండి, పూంచ్‌లో ఈవీఎం మెషిన్లను తగలబెట్టారు. అన్ని ఓట్లు బీజేపీకి వెళ్లేలా ఈవీఎంలను హ్యాక్ చేశారు. చౌకీదార్ దొంగ" అని రాశారు.
ఇదే వీడియోను నస్రుల్లా పొరాలో తీశారని, ఆ ఈవీఎంలలో ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయని కూడా ఇంకొందరు షేర్ చేశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 3
70 వేలకు పైగా ఫాలోయర్స్ ఉన్న ఫేస్‌బుక్ పేజ్ 'డెయిలీ ఇండియా' ఈ వీడియోను షేర్ చేసింది. అందులో "ఇది 2019 లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్. వేరే పార్టీలకు వేసినా ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయి. ఆగ్రహించిన ప్రజలు ఈవీఎంలను తగలబెట్టారు" అని రాసింది.
ఇది కూడా 2017 ఏప్రిల్‌లో తీసిందని, దీనికి 2019 ఎన్నికలతో ఏ సంబంధం లేదని మేం గుర్తించాం.
శ్రీనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆగ్రహించిన మూకలు పోలింగ్ బూత్‌లను టార్గెట్ చేశాయి. అప్పుడు ఈ ఉప ఎన్నికలను బహిష్కరించాలంటూ వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.
మీడియా కథనాల ప్రకారం ఈ వీడియో జమ్ముకశ్మీర్ బడ్గాం జిల్లాలో తీసింది. ఆ సమయంలో 33 ఈవీఎంలను తగలబెట్టారు.
ఈ వీడియో కచ్చితంగా మండీ లేదా నస్రూల్లా పొరాకు సంబంధించింది కాదు.
ఎందుకంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో మే 19న ఏడో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇక, జమ్ము కశ్మీర్‌లో తొలిదశ ఎన్నికలు బారాముల్లా, జమ్ము నియోజకవర్గాల్లో మాత్రమే జరిగాయి.
నస్రుల్లా పొరా బడ్గాం జిల్లాలోకి వస్తుంది. అది శ్రీనగర్ నియోజకవర్గంలో ఒక భాగం. శ్రీనగర్‌లో ఏప్రిల్ 18న రెండో దశ పోలింగ్ జరగనుంది.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్... వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








