సూట్ కేసులో మానవ పిండం.. ముంబయికి అక్రమ రవాణా

ఫొటో సోర్స్, SPL
ముంబయి విమానాశ్రయంలో మానవ పిండాన్ని సూట్‌కేస్‌లో తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనివెనుక ఓ స్మగ్లింగ్ రాకెట్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మార్చి 16న మలేసియాకు చెందిన ఓ వ్యక్తి, మానవ పిండాన్ని ఒక ప్రత్యేక పెట్టెలో భద్రపరిచి, దాన్ని సూట్‌కేస్‌లో తీసుకువెళుతుండగా అధికారులు గుర్తించారు.
మానవ పిండంను భారత్‌కు అక్రమ రవాణా చేయడం ఇది తొలిసారి కాదని, ఆ వ్యక్తి పదేపదే చెప్పారు. ఆ వ్యక్తి అందించిన సమాచారంతో, నగరంలోని ఓ ప్రముఖ ఐవీఎఫ్ క్లినిక్‌పై అధికారులకు అనుమానం కలిగింది.
అయితే.. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమను ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని సదరు ఐవీఎఫ్ క్లినిక్ తెలిపింది.
కానీ, మలేసియా వ్యక్తిని ప్రశ్నించినపుడు.. ఈ పిండాన్ని క్లినిక్‌కు తీసుకువెళుతున్నట్లు తమకు చెప్పాడని, కేసును దర్యాప్తు చేస్తున్న 'డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్' ప్రతినిధి రెబెకా గోన్సేల్వ్స్ ముంబై హైకోర్టుకు తెలిపారు.
క్లినిక్ గురించి చేస్తున్న ఆరోపణలను, ఆ వ్యక్తి దగ్గరవున్న కొన్ని మెసేజ్‌లు బలపరుస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. ఈ వాదనలను క్లినిక్ నిర్వహకులు ఎంబ్రియోలజిస్ట్ డా.గోరల్ గాంధీ ఖండించారు.
'మానవ పిండాలను తన క్లైంట్ దిగుమతి చేసుకోరు' అని గోరల్ గాంధీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
శుక్రవారంనాడు గోరల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈమధ్యకాలంలో భారతదేశంలో ఐవీఎఫ్‌కు ప్రాచుర్యం ఎక్కువగా వచ్చింది. ఈ విధానంలో ద్వారా, పరిశోధనాశాలలో మానవ అండాన్ని ఫలదీకరణ చేసి, ఆ తర్వాత మహిళ గర్భంలో దాన్ని ప్రవేశపెడతారు. ఈ పిండాలను, దానికి అవసరమైన శీతల వాతావరణంలో కొన్ని సంవత్సరాలపాటు నిల్వ ఉంచవచ్చు.
'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' అనుమతి లేకుండా, దేశంలోకి మానవ పిండాలను దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధం.
ఇవి కూడా చదవండి
- మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా....
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- ఈ బొమ్మలు స్త్రీ వక్షోజాల వెనకున్న కథలు
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- మసూద్ అజర్: ‘పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చైనా ఎందుకు అండగా ఉంటోంది?’
- జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి... ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








