గూగుల్: ‘బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్’ అని వెదికితే పాకిస్తాన్ జెండా ప్రత్యక్షం

బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్ అని వెతికితే పాకిస్తాన్ జెండా చిత్రాలు వచ్చేలా గూగుల్ సెర్చ్‌ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 14న పుల్వామాలో భారత సైనికులపై దాడి జరిగిన అనంతరం గూగుల్ సెర్చ్ ఫలితాలు ఇలా వస్తున్నాయి.
పుల్వామాలో సైనికులపై ఆత్మాహుతి దాడి జరగడంతో 46 మంది భారత సైనికులు చనిపోయారు.
ఈ దాడి తమ పనే అని పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ అనే సంస్థ ప్రకటించింది.
ఈ దాడి జరిగిన తర్వాత ఈ టాయిలెట్ పేపర్ అంశం తెరపైకి వచ్చింది.
ఈ దాడిపై పలువురు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో వ్యాఖ్యలు, విమర్శలు చేయడంతో.. గూగుల్ సెర్చ్ ఫలితాలు ఇలా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
ఇలా పాక్ జెండా వచ్చిన వార్తలు కూడా ప్రాచుర్యం కావడంతో.. 'బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్' అని వెదికితే దీనికి సంబంధించిన కథనాలు కూడా వస్తున్నాయి.
అయితే ఇప్పటికీ పాక్ జెండానే ప్రధానంగా కనిపిస్తోంది.
అయితే ఇది ఎలా జరిగిందన్న అంశంపై గూగుల్ ఇంకా స్పందించలేదు.
ఇలా గూగుల్ సెర్చ్ ఫలితాలు ప్రభావితం కావడం ఇదే తొలిసారి కాదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిత్రాలు కూడా గతంలో ఇలాంటి అసభ్య పదాల శోధనలో ప్రత్యక్షమయ్యాయి.
ఇవి కూడా చదవండి
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి
- కశ్మీర్: ప్రజాభిప్రాయ సేకరణను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న కథేంటి?
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?
- అంతర్జాతీయ న్యాయస్థానం: దేశాల మధ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తుంది?
- పుల్వామా దాడి: ఈ స్థాయిలో పేలుడు పదార్థాలు పాక్ నుంచి భారత్‌లోకి తేవడం సాధ్యమేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








