రాబర్ట్ వాద్రా కేసులో ఏం జరుగుతోందో ప్రపంచమంతా తెలుసు- ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఆఫీసుకు వచ్చారు. మనీ లాండరింగ్ కేసులో వాద్రాను విచారించేందుకు ఈడీ ఆయనకు సమ్మన్లు పంపించింది.
ఆయన భార్య, ఇటీవలే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాను ఈడీ ఆఫీసు వరకూ వదలడానికి వచ్చారు. ఆమె తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడంతోపాటు ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్‌ఛార్జిగా చేశారు.
ప్రియాంకను విలేఖరులు కొత్త బాధ్యతలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినపుడు ఆమె "రాహుల్ గారు నాకు ఈ బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషం.'' అన్నారు. భర్తకు ఈడీ సమ్మన్లు రావడంపై మాట్లాడిన ప్రియాంక "ఏం జరుగుతోందో మొత్తం ప్రపంచానికి తెలుసు" అన్నారు.
పార్టీ బాధ్యతలు అందుకున్న తర్వాత ఇన్నాళ్లకు విలేఖరులకు ప్రియాంకను కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
రాబర్ట్ వాద్రా మధ్య దిల్లీలో ఉన్న జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఈడీ ఆఫీసుకు సుమారు 3.45కు చేరుకున్నారు. ఆయన మనీ లాండరింగ్ కేసులో మందస్తు బెయిల్ తీసుకున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని వాద్రా కోర్టుకు చెప్పారు.
లండన్‌లో ఇల్లు కొన్నారనే ఆరోపణలకు సంబంధించి వాద్రాపై మనీ లాండరింగ్ కేసు నడుస్తోంది. గతంలో వాద్రా ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
"బీజేపీ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడులతోనే ఈ మొత్తం కేసులు నడిపిస్తోంది"అని వాద్రా అన్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ లండన్‌లో ఉన్నాయని ఈడీ కోర్టులో చెప్పింది. లండన్‌లో ఆయనకు రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్స్ ఉన్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








