ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: రైతుల కోసం పథకం ‘అన్నదాత సుఖీభవ’

ఫొటో సోర్స్, I&PR-AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో 2019-20 సంవత్సరానికి రూ. 2,26,117.53 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనమండలిలో పురపాలక మంత్రి నారాయణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కొత్త రాష్ట్రంగా నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొన్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని విమర్శించిన విభజన తరువాత రాష్ట్రానికి రాజధాని లేకుండాపోయిందని.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ కూడా సక్రమంగా జరగలేదన్నారు.
కొత్తగా మూడు..
ఏపీ బడ్జెట్‌లో ఈసారి ఒక కొత్త పథకం, కొత్త కార్పొరేషన్, ఒక కొత్త సంస్థను ప్రకటించి కేటాయింపు చేశారు.
రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రకటించి రూ. 5 వేల కోట్లు కేటాయించారు.
త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.
దీంతోపాటు కొత్తగా క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు, డ్రైవర్ల సాధికార సంస్థకు రూ. 150 కోట్లు ఇచ్చారు.
అంకెల్లో బడ్జెట్

వివిధ రంగాలు, శాఖలకు కేటాయింపులు
వ్యవసాయం: రూ. 12,732 కోట్లు
ఉన్నత విద్య: రూ. 3,171 కోట్లు
మాధ్యమిక విద్య: రూ. 22,783 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ: రూ. 10,032 కోట్లు
గృహనిర్మాణం: రూ. 4,079 కోట్లు
జలవనరుల శాఖ: రూ. 16,852 కోట్లు
పౌరసరఫరాలు: రూ. 3,763 కోట్లు
ఇంధన, మౌలిక వసతులు: రూ. 5,473 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ. 35,182 కోట్లు
ఆర్థిక శాఖ: రూ. 51, 841 కోట్లు
అటవీ, పర్యావరణం: రూ. 491 కోట్లు
సాధారణ పరిపాలన: రూ. 1,117 కోట్లు
హోం శాఖ: రూ. 6,397 కోట్లు
పరిశ్రమలు: రూ. 4,114 కోట్లు
చిన్నమధ్యతరహా పరిశ్రమలు: రూ. 400 కోట్లు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: రూ. 1,006 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పన: రూ. 1,225 కోట్లు
రహదారులు, భవనాలు: రూ. 5,382 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధి: రూ. 100 కోట్లు
న్యాయ శాఖకు 918 కోట్లు
అసెంబ్లీకి 149 కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు
ప్రణాళిక: రూ. 1403 కోట్లు
రెవెన్యూ శాఖ: రూ. 5,546 కోట్లు
రియల్ టైమ్ గవర్నెన్స్: రూ. 172 కోట్లు
యువజన, క్రీడలు: రూ. 1982 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
సంక్షేమానికి..
సాంఘిక సంక్షేమం: రూ. 6,861 కోట్లు
బీసీ సంక్షేమం: రూ. 8,242 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ. 1308 కోట్లు
మహిళాశిశు సంక్షేమం: రూ. 3408 కోట్లు
కార్పొరేషన్లు, సబ్ ప్లాన్లు, సంస్థలు, పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు
'అన్నదాత సుఖీభవ' పథకం: రూ. 5 వేల కోట్లు
నైపుణ్యాభివృద్ధి సంస్థ: రూ.458 కోట్లు
డ్రైవర్ సాధికార సంస్థ: రూ. 150 కోట్లు
బీసీ కార్పొరేషన్: రూ. 3 వేల కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్: రూ.100 కోట్లు
క్షత్రియ కార్పొరేషన్: రూ. 50 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి: రూ. 1000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ: రూ. 300 కోట్లు

ఫొటో సోర్స్, facebook/KalavaSrinivasulu
ఎస్సీ సబ్‌ప్లాన్: రూ. 14,367 కోట్లు
ఎస్టీ సబ్‌ప్లాన్: రూ. 5,385 కోట్లు
బీసీ సబ్‌ప్లాన్: రూ. 16,226 కోట్లు
మైనార్టీ సబ్‌ప్లాన్: రూ. 1,304 కోట్లు
పసుపు- కుంకుమ: రూ. 4 వేల కోట్లు
ముఖ్యమంత్రి యువనేస్తం: రూ. 1200 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు: రూ. 1100 కోట్లు
చంద్రన్న బీమా: రూ. 354 కోట్లు
అన్నా క్యాంటీన్లు: రూ. 300 కోట్లు
చేనేతకు సహకారం: రూ. 225 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
9,10 తరగతుల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం: రూ. 156 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు: రూ. 175 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు: రూ. 128 కోట్లు
మైనార్టీలకు దుల్కన్ పథకం: రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ విదేశీ విద్య: రూ. 100 కోట్లు
వృద్ధాప్య, వింతంతు పింఛన్లు: రూ. 10,401 కోట్లు
డిఫరెంట్లీ ఏబుల్డ్ పింఛన్లు: రూ. 2,133కోట్లు
ఉపాధి హామీ పథకం: రూ. 1000కోట్లు
రాజధానిలో భూసమీకరణ: రూ. 226కోట్లు
రాష్ట్రంలో రైల్వేలైన్ల నిర్మాణం: రూ. 150కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్, కో-ఆపరేటివ్ శాఖ: రూ.12,732.97 కోట్లు
పాడి పశు సంవర్ధక, మత్స్యశాఖ: రూ. 2,030.87 కోట్లు
అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాలు: రూ. 491.93 కోట్లు
ఇవి కూడా చదవండి:
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








