రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?- Fact Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నియాస్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దుబాయిలో ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇబ్బందిపడ్డారా? వాస్తవమేంటి?
"ఇటీవల రాహుల్ గాంధీ దుబాయి పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ 14 ఏళ్ల బాలిక ప్రశ్నలతో ఆయన్ను గడగడలాండించారు" అంటూ తాజాగా కొన్ని తెలుగు, తమిళం, ఇంగ్లీష్ న్యూస్ వెబ్‌సైట్లతో పాటు, కొన్ని తమిళ వార్తా పత్రికలు కూడా ప్రచురించాయి.
మైకు పట్టుకుని మాట్లాడుతున్న ఓ బాలిక ఫొటోను కూడా ప్రచురించాయి.
ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ బీజేపీ మహిళా మోర్చా పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలోనూ షేర్ చేశారు.
మరి, ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ఆ బాలిక రాహుల్‌కు ప్రశ్నలు సంధించిందా అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, http://www.beautykola.co
ఇక ఎవరు ఏం రాశారో చూద్దాం.
"జనవరి 10న దుబాయిలో రాహుల్ గాంధీ పాల్గొన్న ఓ సమావేశంలో మంజు కౌర్ అనే 14 ఏళ్ల బాలిక ఆ ప్రశ్న అడిగారు" అంటూ www.beautykola.co అనే వెబ్‌సైట్ తెలుగులో రాసింది.
దినకరన్ అనే పత్రిక పెద్ద శీర్షిక పెట్టి ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, ’’భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 80 శాతం కాలం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇన్నేళ్లూ మీ పార్టీ చేయలేని మంచి పనులను ఇప్పుడు మీరు ఎలా చేయగలరు?" అంటూ రాహుల్ గాంధీని ఆ అమ్మాయి అడిగింది.

ఫొటో సోర్స్, DINAKARAN
దినమలర్ అనే మరో తమిళ పత్రిక కూడా ఇదే విషయాన్ని రాసింది. మైనేషన్.కామ్ , పోస్ట్‌కార్డ్ వెబ్‌సైట్లు కూడా అలాగే రాశాయి.
ఈ కథనాల్లో ఫొటో ఉన్న బాలిక అసలు రాహుల్ గాంధీ హాజరైన సమావేశంలో పాల్గొనలేదని బీబీసీ పరిశీలనలో తేలింది. అది నకిలీ వార్త అని తేలింది.
'kidsandShare' పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో నుంచి ఆ చిత్రాన్ని తీసుకున్నారు. లింగ వివక్ష గురించి ఆ వీడియోలో బాలిక మాట్లాడుతోంది.
అసలు వాస్తవం ఏంటి?
ఇటీవల రాహుల్ గాంధీ దుబాయి పర్యటనకు వెళ్లినప్పుడు మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో ఒక సమావేశం, కార్మికులతో మరో సమావేశం, మరోటి దుబాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ సమావేశాల్లో వేల మంది పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, BILAL ALIYAR
విశ్వవిద్యాలంలో విద్యార్థుల ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలు చెప్పారు. రెండో సమావేశాల్లో పాల్గొన వారి నుంచి కూడా ప్రశ్నలను రాహుల్ స్వీకరించారు. అయితే, ఈ మూడు కార్యక్రమాల్లో ఎక్కడా అలాంటి బాలిక రాహుల్‌కు ప్రశ్నలు వేయలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆంధ్రాకు హోదా వస్తుందా?
ఈ సమావేశాల్లో పాల్గొన్న బిలాల్ అలయార్ అనే వ్యక్తితో బీబీసీ మాట్లాడింది. "క్రికెట్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఎవరూ ప్రశ్నలు వేయలేదు. రాత్రి 7.40 గంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభించారు. భారత దేశ అభివృద్ధిలో ప్రవాసుల పాత్ర, సహనం వంటి విషయాలపై ఆయన మాట్లాడారు" అని బిలాల్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"అసలు ఆ సమావేశంలో ప్రశ్నలు, జవాబుల సెషనే లేదు. అయితే, రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తుందా? అని అడిగారు. అందుకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తుందని రాహుల్ చెప్పారు. ఈ పత్రికలు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పేర్కొంటున్న అమ్మాయి ఆ కార్యక్రమంలో పాల్గనలేదు" అని బిలాల్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ క్యాబినెట్: పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు ఎప్పుడు?
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- ఇలాగైతే.. లండన్‌లో తెలుగోళ్లకు ఇల్లు కష్టమే!
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- క్యాథలిక్ చర్చిల్లో మతాచార్యుల ఆధిపత్యం: ‘వాళ్లు చెప్పినదానిని గొర్రెల్లా అనుసరించాలి.. అంతే’
- ‘రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించార’ని నటిపై కేసు
- వివేకానందుడు చికాగో ప్రసంగంలో ఏం చెప్పారు?
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








