చెన్నై: పులిపిల్లను బ్యాగులో పెట్టుకుని విమాన ప్రయాణం... ప్రయాణికుడి అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
లగేజ్ బ్యాగ్‌లో సాధారణంగా ఏముంటుంది? మీకు తెలిసేవుంటుంది.. కానీ శనివారం చెన్నై విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగులో ఓ పులి పిల్ల కనిపించింది.
బ్యాంకాక్ నుంచి చెన్నై విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి లగేజ్‌లో ఏవో వింత అరుపులు వినిపించడంతో కస్టమ్స్ ఆఫీసర్లు ఆయన్ను తనిఖీ చేశారు.
ప్రయాణికుడి వద్ద ఉన్న ఓ ప్లాస్టిక్ బాస్కెట్ నుంచి శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బాస్కెట్‌ను తెరవగా, అందులో ఓ బుల్లి పులి పిల్ల కనిపించింది.
నెల రోజుల వయసు, ఒక కేజీ బరువు ఉన్న ఆ పులి పిల్ల భయంతో వణికిపోతూ, చాలా బలహీనంగా కనిపించింది.
సదరు ప్రయాణికుడికి అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలిపారు.
45 సంవత్సరాల ప్రయాణికుడి పేరును అధికారులు వెల్లడించలేదు. కానీ అధికారుల ప్రశ్నలకు ప్రయాణికుడు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భయంతో వణికిపోతున్న ఆ పులి పిల్లకు అధికారులు పాలు తాగిస్తున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
ఈ పులి పిల్లను చెన్నైలోని అరైంగర్ అన్నా జూలాజికల్ పార్క్‌కు తరలించి, దానికి చికిత్స చేస్తామని అధికారులు ఎన్డీటీవీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








