జార్జి ఫెర్నాండెజ్- జయా జైట్లీ: రాజకీయ నేతల సహజీవన సంబంధాలపై ప్రశ్నలు ఉండవా?: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేను జయా జైట్లీ గురించి ఆలోచిస్తున్నా. "మనం ఉన్న ఈ లోకంలో చాలా అన్యాయం జరుగుతుంది. భగవంతుడు వారికి ధైర్యం, శాంతి ఇవ్వాలి".

ఫొటో సోర్స్, Divya Arya/twitter
"జయా జైట్లీకి ధైర్యంతో ఉండాలి. ఆమె ఆయన్ను ప్రేమించేవారు. కుటుంబంతో సహా మిగతా అందరూ వదిలేసి వెళ్లిపోయినపుడు ఆయన్ను ఆమే చూసుకునేవారు".

ఫొటో సోర్స్, Divya Arya/twiter
"జార్జి ఫెర్నాండెజ్ ఒక్క బంద్ పిలుపుతో మొత్తం భారతదేశమంతా రైల్వే పనులు ఆగిపోయేవి. ఆయన ఇప్పుడు లేరు. ఈ సమయంలో నేను సుదీర్ఘ కాలంపాటు ఆయన స్నేహితురాలిగా ఉన్న జయా జైట్లీ గురించి ఆలోచిస్తున్నాను".

ఫొటో సోర్స్, Divya Arya/twitter
మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మరణంపై ట్విటర్‌లో వెల్లువెత్తుతున్న సంతాప సందేశాల్లో అందరూ జయా జైట్లీ గురించే రాస్తున్నారు.
జర్నలిస్టులు కూడా జార్జి ఫెర్నాండెజ్ అంతిమ సంస్కారాల గురించి సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీనే అడుగుతున్నారు.
జయా జైట్లీ, జార్జి ఫెర్నాండెజ్ తమ బంధానికి స్నేహం అనే పేరు పెట్టుకుంటూ వచ్చారు. ఆమె ఎన్నో ఏళ్ల పాటు ఆయన ఇంట్లో ఉన్నారు. దాన్నే మామూలు మాటల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అనే పేరుతో పిలుస్తారు.
కానీ సామాన్య జనం ఈ నేతల లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆ కారణాన్ని ఖండించలేదు, ఆ నేతలు కూడా ఈ వాస్తవాలను ఎప్పుడూ దాచలేదు.
బీబీసీతో ఒకసారి ఈ బంధం గురించి మాట్లాడిన జయా జైట్లీ "రకరకాల స్నేహితులు ఉండేవారు. స్నేహంలో కూడా చాలా స్థాయిలు ఉండేవి. మహిళలకు ఒక విధమైన గౌరవం ఇవ్వడం చాలా అవసరం అవుతుంది. మన పురుషాధిక్య సమాజంలో ఎక్కువమంది మహిళలు బలహీనంగా ఉంటారని భావిస్తారు. జార్జి అలాంటి వారు కారు. మహిళలకు కూడా రాజకీయ ఆలోచనలు ఉండచ్చని ఆయన నాలో విశ్వాసం కల్పించారు" అన్నారు.
రాజకీయంగా మొదలైన ఈ స్నేహం కాలంతోపాటు గాఢంగా మారింది. జయా ఆమె భర్త అశోక్ జైట్లీ విడిపోయినప్పుడు జార్జి, ఆయన భార్య లైలా కబీర్ కూడా విడిపోయారు. 1980వ దశకంలో జయ, జార్జ్‌తో కలిసి ఉండడం ప్రారంభించారు.

"మా బంధంలో రొమాన్స్ అనేది అస్సలు లేదు, కానీ జనం మాత్రం చాలా చెప్పుకునేవారు. అప్పుడు జార్జి నాతో ఎవరైనా వచ్చి మీ పడక సరిచేస్తారని ఎదురుచూడడానికి, రాజకీయం అంటే పూలపాన్పు కాదు అన్నారు" అని జయ చెప్పారు.
"జార్జితో కలిసి ఉండాలనేది నా నిర్ణయమే. కష్టంగా అనిపిస్తే, వెళ్లిపోడానికి మీకు స్వేచ్ఛ ఉంది అని జార్జి నాకు స్పష్టంగా చెప్పారు" అన్నారు.
30 ఏళ్ల ముందు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి బహిరంగంగా చర్చించుకునేవారు కాదు, సుప్రీంకోర్టు ఇచ్చే ఏదైనా తీర్పు గురించి, గృహహింస చట్టం గురించి కూడా అసలు ఆలోచించేవారు కాదు.
అప్పుడు చట్టం దృష్టిలో సుదీర్ఘ కాలంపాటు కలిసి ఉన్న పురుషుడు,మహిళను పెళ్లైనవారుగా భావించేవారు. వారి సంతానాన్ని సక్రమంగా భావిస్తారు. ఇప్పుడు అలాంటి బంధంలో లేకపోయినా ఒక మహిళ 'భార్య'లాగే 'గృహ హింస' ఫిర్యాదు చేయవచ్చు.
కానీ అప్పట్లో లేదు. అప్పుడు ఈ ఇద్దరు నేతలు అగ్రస్థానంలో ఉన్నారు. జార్జి ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉంటే, జయా జైట్లీ సమతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు.
"జయా జైట్లీ, జార్జి ఫెర్నాండెజ్ కేవలం సమతా పార్టీలో కలిసి పనిచేసిన సహచరులు మాత్రమే కాదు. వారి మధ్య బంధం సోషలిస్టు భావజాలానికి సంబంధించిందే కాదు" అని రచయిత్రి, కాలమిస్ట్ శోభ అంటారు.

ఫొటో సోర్స్, jaya jaitly
వారి మధ్య ఉన్నఆ గాఢమైన బంధం, అందరికీ తెలిసిందే. వారు కూడా దాన్ని దాయాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు.
రాజకీయాల్లో ఉండే వారు తమ వ్యక్తిగత జీవితం చాలా పవిత్రం అనే ఇమేజ్‌ను ఇష్టపడతారు.
అమెరికా రాజకీయాల్లో భార్య-భర్త, పిల్లల మొత్తం పరివారం ఉండడం అనేది ఒక రాజకీయ లబ్ధిగా భావిస్తారు. ప్రచారంలో వారిని ఉపయోగించుకుంటారు కూడా.
భారత్‌లో కుటుంబాలకు అత్యున్నత హోదా ఇస్తారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లేదా రెండో పెళ్లిని కాస్త తక్కువగా చూస్తారు. కానీ రాజకీయ నేతలు మాత్రం ఈ రెండు దారుల్లో నడుస్తారు. ప్రజలు కూడా వాటిని తప్పుగా భావించరు.
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి, నటి రాధికా కుమారస్వామి బంధం గురించి కూడా చాలా ఊహాగానాలు సాగాయి. కానీ వాట్సాప్‌లో షేర్ అయిన జోకులు, సోషల్ మీడియాలో కామెంట్స్ తప్ప దాని ప్రభావం పెద్దగా లేదు.
హెచ్.డి.కుమారస్వామి బహిరంగంగా ఎప్పుడూ రాధికా కుమారస్వామిని తన భార్యగా చెప్పలేదు. అలా అని తమ బంధాన్ని ఖండించనూ లేదు.

ఫొటో సోర్స్, NG HAN GUAN/AFP/GETTY IMAGES
ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి, రాజ్‌కుమారీ కౌల్ బంధం ఎప్పుడూ చర్చల్లో ఉంటూ వచ్చింది. అయితే వాజ్‌పేయి ఈ బంధం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.
ఇద్దరూ గ్వాలియర్‌లోని ప్రముఖ విక్టోరియా కాలేజ్(రాణీ లక్ష్మీబాయి కాలేజ్)లో కలిసి చదివేవారు. తర్వాత రాజ్‌కుమారీ కౌల్, ఆమె భర్తతో అటల్ బిహారీ వాజ్‌పేయికి మంచి స్నేహం కుదిరింది.
వాజ్‌పేయి ప్రధాని అయ్యాక శ్రీమతి కౌల్ కుటుంబం, 7 రేస్‌కోర్స్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలోనే ఉండడానికి వచ్చేసింది. వారి చిన్నకూతురు నమితను అటల్ దత్తత కూడా తీసుకున్నారు.
'శావీ' పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీమతి కౌల్ "నేను, అటల్ బిహారీ వాజ్‌పేయి దీని గురించి ఎవరికైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు" అన్నారు.
సాధారణ ప్రజలతో పోలిస్తే రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలు మాత్రం భిన్నంగా ఉంటాయా. వారి వ్యక్తిగత బంధాల గురించి ప్రశ్నలు లేవనెత్తకపోవడం అంటే, అది ఆ నేతను గౌరవించడమేనా. లేదా మీ జీవితంలో బంధాల గురించ తంటాలు పడుతున్న మీకు నేతల వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే తీరిక లేదా.

ఫొటో సోర్స్, SHAMIKA ENTERPRISES
జయా జైట్లీ 2010లో జార్జి ఫెర్నాండెజ్‌ను కలవకుండా ఆయన భార్య లైలా కబీర్ అడ్డుకున్నారనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు.
2008లో జార్జికి 'అల్జీమర్' వ్యాధి వచ్చినపుడు, ఆయన జ్ఞాపకశక్తి, గుర్తుపట్టే శక్తి తగ్గిపోవడం మొదలైంది.
సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2014లో 15 రోజులకు ఒకసారి జార్జి ఫెర్నాండెజ్‌ను 15 నిమిషాలు కలవడానికి జయా జైట్లీకి అనుమతి లభించింది.
కానీ జీవితం ఎన్నో మలుపులు తీసుకుంటుంది. మంగళవారం జయా జైట్లీ జర్నలిస్టులతో మాట్లాడుతూ, జార్జి ఫెర్నాండెజ్ మరణవార్త తనకు లైలా కబీర్ ద్వారానే తెలిసిందని, ఆమె తనను ఇంటికి రమ్మన్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా...
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- అభిప్రాయం: 'వివాహేతర లైంగిక సంబంధాల చట్టంలోని వివక్ష తొలగిపోయింది'
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








