ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహం సమీపం నుంచి మొసళ్లను ఎందుకు తరలిస్తున్నారు?

ప్రపంచంలో అత్యంత పొడవైన.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం సమీపంలోని జలాశయంలో గల మొసళ్లను బంధించి.. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు.
గుజరాత్‌లోని నర్మదా నది మీద నిర్మించిన సర్దార్ సరోవర్ జలాశయం సమీపంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని గత ఏడాది అక్టోబర్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాంస్య పూతతో నిర్మించిన ఈ విగ్రహం అహ్మదాబాద్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' గా అభివర్ణిస్తున్న పటేల్ విగ్రహం ప్రంచంలోనే అత్యంత పొడవైన విగ్రహం కావటంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కానీ ఇక్కడికి వెళ్లటానికి రైలు మార్గం లేదు. పర్యాటకులు ప్రధానంగా బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకుంటున్నారు.
సర్దార్ సరోవర్ జలాశయంలో సుమారు 300 వరకూ మొసళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని దాదాపు మూడు మీటర్ల వరకూ పొడవున్నాయి. వీటిని ఇనుప బోనుల్లో ఎరవేసి పట్టుకుంటున్నారు. గుజరాత్‌లోని మరో ప్రాంతానికి తరలిస్తున్నారు.
సందర్శకులకు సీప్లేన్ (నీటి విమానం) సర్వీసులు అందించటానికి వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
కానీ ఈ ప్రణాళికను పర్యావరణ ఉద్యమకారులు తప్పుపడుతున్నారు.
పర్యాటకుల సంఖ్య పెరగటంతో భద్రతా కారణాల రీత్యా జలాశయంలోని మొసళ్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు స్థానిక అటవీశాఖ అధికారి అనురాధా సాహు చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
ఇప్పటివరకూ సుమారు ఒక డజను మొసళ్లను పట్టుకుని ట్రక్కుల ద్వారా వేరే ప్రాంతానికి తరలించారు.
మొసళ్లను తరలించాలన్న నిర్ణయం దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించటమేనని కమ్యూనిటీ సైన్స్ సెంటర్ డైరెక్టర్ జితేంద్ర గావాలి పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''ఈ మొసళ్ల ఆవాసాన్ని ప్రభుత్వం చెదరగొడుతోంది. ఈ జీవుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది'' అని ఆయన తప్పుపట్టినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
''ఇక్కడ బంధించిన మొసళ్లను క్షేమంగా ఎక్కడ వదిలిపెట్టాలన్న విషయం గురించి ప్రభుత్వం ఆలోచించలేదు'' అని కూడా ఆయన విమర్శించారు.
వన్యప్రాణి మేగజీన్ 'సాంక్చురీ ఏసియా' ఎడిటర్ బిట్టు సెహగల్ కూడా ఈ ప్రణాళికను తప్పుపట్టారు.
- సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మోదీకి ఎందుకంత ఇష్టం?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..
- గాంధీజీ మెచ్చిన పెన్ను రాజమండ్రిలో తయారైంది
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- రిపబ్లిక్ డే పరేడ్‌లో పురుష దళాన్ని లీడ్ చేస్తున్న హైదరాబాద్ మహిళా ఆఫీసర్.. చరిత్రలో తొలిసారి
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









