మహిళా రిజర్వేషన్ల మీద ఎందుకు ప్రశ్నించరు? :అభిప్రాయం

మహిళలు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మృణాల్ పాండే
    • హోదా, బీబీసీ కోసం

కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. ఈ వాక్యం ఉపయోగించడానికి కారణం రిజర్వేషన్ల గురించి కాస్త రుచించని నిజాన్ని కూడా అందరి ముందు ఉంచాలి అనుకోవడమే.

దానిని మీడియా, కోట్లాది ప్రేక్షకులకు సరిగా అర్థమయ్యేలా చెప్పడం మరీ ముఖ్యం.

రిజర్వేషన్లు లేని (అగ్రవర్ణాల) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే తాజా ప్రదర్శనలో అన్ని పార్టీల పురుషుల (కొందరు మహిళలు కూడా) మధ్య ఆశ్చర్యపరిచేంత ఐక్యత కనిపించింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు ఎలాంటి నోటీసు, మిగతా పార్టీలతో చర్చ లేకుండా రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ, ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం ఎందుకు వేశారు?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. మేం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పుకుని ఇప్పుడు ఏ పార్టీ అయినా స్వయంగా నష్టపోవాలని కోరుకోదు. కానీ మహిళలకు వారి మొత్తం నిష్పత్తి కంటే తక్కువగా కేవలం 33 శాతం రిజర్వేషన్లు అందించడం కోసం ఒక బిల్లు పాతికేళ్లుగా ఊగిసలాడుతూనే ఉంది.

పార్లమెంటు బయట దానిపై చాలా సానుకూల వైఖరి చూపిస్తూనే, సభ లోపల మాత్రం నిశ్శబ్దంగా ఏకాభిప్రాయంతో బిల్లును పక్కన పెట్టేస్తారు.

దేశంలోని 50 శాతం మహిళా జనాభా కోసం 33 శాతం రిజర్వేషన్లనే ఈ బేతాళుడిని చెట్టు పైనుంచి దించి తీసుకొచ్చే సాహసం 56 అంగుళాల చాతీ ఉన్న ప్రధానమంత్రి కూడా చేయలేదు. ఎందుకు?

సంక్రాంతి సంబరాలు

ఫొటో సోర్స్, RSTV

మహిళా సాధికారత ఎక్కడ?

మహిళా సాధికారతపై ఎప్పుడూ జరిగే సదస్సుల్లో ప్రధాని ఎన్నో మాటలు చెబుతారు. తల్లులు, సోదరీమణుల సాధికారత కోసం తన ప్రభుత్వ హామీలు, ఉద్దేశాల గురించి చాలా వినిపిస్తారు. కానీ ఈసారీ రిజర్వేషన్ల పరిధి పెంచే సమయం ఆసన్నమైనపుడు దుష్యంతుడులాగే ఆయన కూడా ఇచ్చిన మాట మర్చిపోయారు. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదా?

పార్లమెంటులో ఈ పది శాతం రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చల్లో రెండు విషయాలు ప్రతి తెలివైన మహిళనూ ఆలోచించేలా చేశాయి.

మొదటిది, దాదాపు పూర్తిగా యువకులకు ఉద్యోగాలు అందించడం, పురుషుల్లో అగ్రవర్ణ పేదల గౌరవానికి సంబంధించి ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రభుత్వ ఉద్యోగాలు లేదా కాలేజీల్లో మొత్తం మహిళల్లో ఏడు, ఎనిమిది శాతానికి మించి ఎక్కువ మంది అర్హత సాధించలేకపోయారు. దీన్నిబట్టి వారికి చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. సాహసికులైన పురుషుల కంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కుని, అధికార పక్షాన్ని ఎదిరించి, ప్రమాదకరమైన ఉద్యమాల వార్తలను ప్రజల చెంతకు చేర్చిన సీనియర్ మహిళా జర్నలిస్టులు కూడా పది శాతం రిజర్వేషన్లు పెద్ద విషయం కానట్టు టీవీ చర్చల్లో దాన్ని పక్కన పెట్టారు.

ఈ అంశంపై తమ అభిప్రాయాలను గట్టిగా చెప్పాలన్న ఆలోచన పురుష యాంకర్లకు వచ్చుండకపోవచ్చు, కానీ మహిళా యాంకర్లకు కూడా రాలేదు.

మహిళలు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళల పట్ల నిర్లక్ష్యం

వ్యవసాయం, స్వయం ఉపాధి లాంటి వాటి కోసం ఉద్యమాలు జరిగినప్పుడు పార్లమెంటు నుంచి రోడ్డు మీద వరకూ కవరేజీలో మహిళ కనిపించకపోవడం చూస్తే మహిళలను నిర్లక్ష్యం చేయడం అనే అదే దేశ సంప్రదాయం మళ్లీ బహిర్గతమైనట్టుంది.

ఈ మహిళలే తర్వాత వార్తల్లో ఆత్మహత్యలు లేదా పోలీసుల తూటాలకు బలైపోయిన మృతుల వితంతువులు, తల్లుల రూపంలో తెరపైకి వస్తారు.

ఇక రెండో విషయం, పది శాతం రిజర్వేషన్లను దొడ్డిదారిన ఇంత హడావుడిగా తీసుకురావడం దురదృష్టకరం. కానీ పార్లమెంటులో రిజర్వేషన్లను కవర్ చేస్తున్న మీడియా ప్రభుత్వ ప్రకటనల రేటును సర్కారు 25 శాతం పెంచిందనే వార్తను కూడా కలిపి నడిపించాయి.

కానీ అదే మీడియా మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న దోపిడీ గురించి ఏమాత్రం ప్రస్తావించక పోవడానికి కారణం ఏంటి?

మీటూ తర్వాత మీడియా ప్రపంచం నుంచి ఒక్కొక్కటిగా వేధింపుల ఘటనలు బయటపడినా, వాటిని కళ్లారా చూసిన మహిళా మీడియా ప్రతినిధుల్లో కూడా అగ్రవర్ణాల రిజర్వేషన్లకు దక్కిన ప్రాధాన్యం మహిళా రిజర్వేషన్ల అంశానికి లభించలేదు.

సీనియర్ మహిళా ప్రతినిధులు చాలాసార్లు ఇదంతా చూస్తూ, వింటూ చాలా గందరగోళంలో పడిపోయారు. ఒక పార్టీ జనరల్ రిజర్వేషన్ల గురించి ఒక స్పష్టత ఇస్తే, రెండో పార్టీ ఇంకొకటి చెబుతుంది.

రాజ్యసభ, జనరల్ కేటగిరీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Rajyasabhatv/Youtube

నోరు మెదపని పార్టీలు

కానీ ఈ రెండూ దశాబ్దాల నుంచి పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశంపై సమాజం నైతికతను ఉల్లంఘిస్తూ వచ్చాయి.

తర్వాత పార్లమెంట్ లేదా మీడియాలో మహిళా రిజర్వేషన్ల అంశంపై తమ ప్రతినిధులు నోరు మెదపకుండా చేశాయి.

ఇటు మీడియా వేగంగా విస్తరించడంతోపాటు దాని యజమానుల బలం, వారి ఏర్పాటుచేసిన వ్యాపారాలు మారుతూనే ఉనాయి.

కొత్త కంపెనీ యజమాన్యం, వారి కార్పొరేట్ ఆర్థిక సంస్థ స్వయంగా మహిళా ప్రతినిధుల వేతనం, భద్రత, ప్రసూతి వసతుల లాంటి విషయాల్లో ఆర్థిక, నైతిక పరిమితులను స్పష్టంగా ఉల్లంఘించి దోషిగా నిలిచింది.

తగిన చట్టాలు లేకుండా ఇలాంటి అన్యాయాలను ఎదుర్కోవడం అసంభవం. కానీ ఈ చట్టాలు చేసే సభలో మహిళల సంఖ్య పది శాతం కూడా లేకపోవడం హాస్యాస్పదం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)