ఐపీఎల్ 2019: ఇండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడకుండానే వేలంలో రూ.8.4 కోట్లు పలికిన వరుణ్ చక్రవర్తి

ఫొటో సోర్స్, TNPL
ఐపీఎల్ 2019 సీజన్ కోసం జరిగిన వేలంలో తమిళనాడుకు చెందిన యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి రూ.8.4 కోట్లు పలికాడు. ఇతన్ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసింది.
వరుణ్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున ఆడలేదు.
వరుణ్ బీబీసీ ప్రతినిధి శివ ఉళగనాథన్‌తో మాట్లాడుతూ... ఐపీఎల్‌లో ఆడే అవకాశం వచ్చినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
"నేను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వేలంలో పలికిన ధర కంటే, ఐపీఎల్ జట్టుకు ఎంపికైనందుకే ఎక్కువ ఆనందంగా ఉంది" అని చెప్పాడు.
తనలోని నైపుణ్యాన్ని గుర్తించి, అవకాశం కల్పించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఐపీఎల్ జట్టుకు ఎంపిక కావడం ద్వారా భారత జట్టుకు ఆడేందుకు ఓ అడుగు ముందుకు పడిందని భావిస్తున్నారా? అని అడిగినప్పుడు... "తప్పకుండా, టీమిండియా తరఫున ఆడటం నా కల. దాన్ని సాకారం చేసుకునేందుకు నేను ఇప్పుడు మంచి ప్రతిభ చూపించాలి" అని వరుణ్ చెప్పాడు.
వరుణ్ మొదట్లో వికెట్ కీపర్‌గా చేసేవాడు. తర్వాత స్పిన్ బౌలింగ్‌లో పట్టు సాధించాడు. ఆ మార్పు ఎలా జరిగిందని అడగ్గా.. "నేను పాఠశాల స్థాయి పోటీల నుంచీ వికెట్ కీపర్‌గా ఉన్నాను. స్కూల్ తర్వాత పై చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. దాంతో ఏడేళ్ల పాటు పెద్దగా క్రికెట్ ఆడలేదు. ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ మీద ఆసక్తి కలిగింది. అప్పటి నుంచి స్పిన్‌ను మెరుగుపరుచుకున్నా" అని వివరించాడు.
గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు సారధి అశ్విన్ తనకు బౌలింగ్‌లో మార్గనిర్దేశం చేయడంతో పాటు, ఎంతగానో ప్రోత్సహించారని వరుణ్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వేలంలో మరో ఆటగాడు జయదేవ్ ఉనాద్కట్‌ను 8.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
కాకినాడకు చెందిన హనుమ విహారి రూ. 2 కోట్లు పలికాడు. దిల్లీ క్యాపిటల్స్ అతన్ని చేజిక్కించుకుంది.
ఇంగ్లండ్ లెఫ్ట్- హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ సామ్ కురాన్ ఈ వేలంలో రూ.7.2 కోట్ల ధర పలికాడు. అతన్ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసింది.
కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి ప్రవేశించిన యువరాజ్‌ను కొనుగోలు చేసేందుకు తొలి రౌండ్‌లో ఏ జట్టూ ముందుకు రాలేదు.
ఇవి కూడా చదవండి:
- ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎందుకు విఫలమైంది?
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుంది?
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ఆంధ్రలో మొన్న తిత్లీ, నేడు పెథాయ్ తుపాను
- "బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉంటే, పిల్లల పెంపకంపై ప్రకటనలు చూపిస్తారా?"
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








