17 ఏళ్ల అబ్బాయిని పెళ్లాడిన మహిళ.. అతడిని లైంగికంగా వేధించారని ఆమెపై కేసు

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఐదు నెలల పాప తల్లిపై పోక్సో( ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్) చట్టం కింద కేసు నమోదైంది.

ప్రస్తుతం ఈ మహిళ తన పాపతోపాటు బాయ్‌కులా జైల్లో ఉంది.

ఆమె బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆమెకు బెయిల్ లభించలేదు

ఈ మహిళ 17 ఏళ్ల అబ్బాయిని లైంగికంగా వేధించారన్నది ఆరోపణ.

అబ్బాయి కుటుంబ సభ్యులు మహిళపై సుమారు ఏడాది క్రితం కేసు పెట్టడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెను విచారించిన ముంబై కుర్లా పోలీసులు ఈ నెల మొదట్లో ఆమెను అరెస్టు చేశారు.

కుర్లా పోలీస్ స్టేషన్‌లోని ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కేసు సుమారు ఏడాది క్రితం నమోదైందని, కానీ కేసు సున్నితంగా ఉండడంతో అప్పటికప్పుడే దానిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయామని తెలిపారు.

ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశామని, మహిళను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. దీనిపై కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.

అసలు కేసేంటి

కుర్లా పోలీస్ స్టేషన్‌లో అబ్బాయి తల్లి ఈ మహిళపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్‌లో 2017 నవంబర్ 23న ఆ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇంటికి వచ్చిందని, తర్వాత తన కొడుకు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడని ఆరోపించారు.

మరోవైపు ఆ 17 ఏళ్ల అబ్బాయి తన భర్త అని పోలీసులు అరెస్టు చేసిన మహిళ చెబుతోంది.

ఆమె వాంగ్మూలం ప్రకారం మైనర్ అబ్బాయి గత రెండేళ్లుగా 20 ఏళ్ల ఈ మహిళతో కలిసి ఉంటున్నాడు. అబ్బాయి తల్లి మాత్రం ఆ మహిళ రెండు సార్లు వివాహం చేసుకుందని చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, నకిలీ పెళ్లి ఎలా జరిగిందో చూడండి

అబ్బాయి తల్లి ఆరోపణల ప్రకారం, ఆ మహిళకు ఇది రెండో పెళ్లి, ఆమె అబ్బాయిని బలవంతంగా లొంగదీసుకుని పెళ్లి చేసుకుంది.

ఈ ఆరోపణల ఆధారంగా కుర్లా పోలీసులు మహిళపై కిడ్నాప్, ఐపీసీ సెక్షన్ల కింద బెదిరించడం, పోక్సో, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

నిందిత మహిళ ముంబై సివిల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని మహిళ చెబుతోంది.

చాలా కాలం నుంచీ ఇద్దరికీ పరిచయం ఉందని, పెళ్లి కూడా చేసుకున్నామని, అతడి వల్ల తనకు ఐదు నెలల కుమార్తె కూడా పుట్టిందని మహిళ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)