ప్రీతీ జింటా: #మీటూ ఉద్యమంపై బాలీవుడ్ నటి వ్యాఖ్యలు.. వెల్లువెత్తిన విమర్శలు

ఫొటో సోర్స్, Getty Images
#MeToo ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడారంటూ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటీవల 'బాలీవుడ్ హంగామా' అనే సినిమా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే, తన ఇంటర్వ్యూను 'ఎడిటింగ్ సరిగా' చేయకపోవడమే ఈ వివాదానికి కారణమని ప్రీతీ జింటా అన్నారు.
మహిళల పట్ల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత ఏడాది హాలీవుడ్ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారు.
ఇటీవల భారత్‌లోనూ #MeToo ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కమెడియన్లు, పాత్రికేయులు, రచయితలు, సినీ నటులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు మహిళలు వెల్లడించారు.
ప్రీతీ జింటా చాలా కాలంగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నప్పటికీ, ఒకప్పుడు పరిశ్రమలో ఆమె అగ్ర కథానాయికగా వెలిగారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ నటులతో కలిసి ఆమె సినిమాలు చేశారు. అందుకే, ఇప్పటికీ ఆమెకు గుర్తింపు ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గత కొన్ని వారాలలో చాలా మంది నటీనటులు లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుగా మాట్లాడారు. #మీటూ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని ప్రముఖులను పదే పదే ప్రశ్నించడం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీతీ జింటా ఆ అంశం గురించి ఏమాత్రం తెలుసుకోకుండా ఇంటర్వ్యూకు వచ్చారని బీబీసీ దిల్లీ ప్రతినిధి గీతా పాండే చెప్పారు.
మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా వేధింపులకు గురయ్యారా? అని అడిగినప్పుడు... ఆమె సరదాగా నవ్వుతూ, "లేదు.. నాకు అలా ఎప్పుడూ జరగలేదు. నాకు అలా జరిగి ఉంటే బాగుండేది... అప్పుడు మీ ప్రశ్నకు ఏదైనా జవాబు చెప్పగలిగేదాణ్ని" అని బదులిచ్చారు.
అంతటితో ఆగకుండా, "మీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని మీరు కోరుకుంటారో వారు అలాగే ప్రవర్తిస్తారు" అని కూడా అన్నారు. ఆ విధంగా ఆమె "బాధితులను అవమానించేలా" వ్యాఖ్యలు చేశారంటూ చాలా మంది విమర్శించారు.
ఇంటర్వ్యూ మొదట్లో, మీటూ ఉద్యమం మొదలవడం మంచిదేనని చెప్పిన ప్రీతీ జింటా... ఆ తరువాత, "కానీ, కొందరు మహిళలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేని విషయాలను కూడా వ్యక్తిగత ప్రతీకారం కోసం, పబ్లిసిటీ కోసం ఉపయోగిస్తూ ఉద్యమాన్ని పలుచన చేస్తున్నారు" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆమె మీటూ ఉద్యమాన్ని అవమానించారని చాలా మంది విమర్శలు గుప్పించారు.
ఈ పరిణామాల తరువాత ప్రీతీ జింటా ఓ ట్వీట్ చేస్తూ, తన ఇంటర్వ్యూ వీడియోను దారుణంగా ఎడిట్ చేశారని, దాన్ని ఆషామాషీ వ్యవహారంగా మార్చేశారని ఆరోపించారు.
అయినప్పటికీ, చాలా మంది ఆమె మరింత మెరుగ్గా స్పందించి ఉండాల్సిందని అన్నారు.
నటి తనుశ్రీ దత్తా తనను నానా పాటేకర్ 2000 సంవత్సరంలో ఒక సినిమా షూటింగ్ సందర్భంలో వేధించారని గత సెప్టెంబర్ నెలలో ప్రకటించడంతో భారతదేశంలో మీటూ ఉద్యమం మొదలైంది. అవన్నీ అబద్ధాలని పాటేకర్ ఆ ఆరోపణలు తోసిపుచ్చారు.
ఆ తరువాత మరికొందరు బాలీవుడు నటులు, దర్శకుల మీద కూడా అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఆరోపణలు వెలుగు చూశాయి.
భారతదేశ మీటూ ఉద్యమంలో ఆరోపణలను ఎదుర్కొన్న అత్యంత ప్రముఖుడు ఎంజే అక్బర్. పది మందికి పైగా మహిళలు ఆరోపణ చేయడంతో ఈ కేంద్ర మంత్రి గత నెలలో తన పదవికి రాజీనామా చేశారు. అక్బర్ కూడా ఆ ఆరోపణన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. ఒక మహిళా జర్నలిస్ట్ మీద ఆయన పరువు నష్టం దావా కూడా వేశారు.
ఇవి కూడా చదవండి
- #MeToo: ఏది వేధింపు? ఏది కాదు?
- అభిప్రాయం: #Metooతో మహిళలు ఏం సాధించారంటే...
- వైరల్: మాజీ అధ్యక్షులతో కలసి 'తాగుతున్న' డోనల్డ్ ట్రంప్
- రెండో ప్రపంచ యుద్ధం నాటి ‘జర్మన్ గర్ల్స్’కు నార్వే ప్రధాని క్షమాపణ
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- కేసీఆర్ ఖమ్మం సభ: 'ఒక కులం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కులంలో మొత్తం దరిద్రం పోతదా?'
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- 'ఆడవాళ్ళను తడిమితే తప్పు లేదని మా నేత చెప్పాడు, అందుకే అలా చేశాను'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








