సుప్రీం కోర్టు: జనవరి ఒకటికి ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్ ఇవ్వవచ్చు

ఫొటో సోర్స్, High court website
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉమ్మడిగా కొనసాగుతున్న హైకోర్టు విభజనకు జనవరి ఒకటో తేదీ నాటి కల్లా నోటిఫికేషన్ జారీ చేయవచ్చునని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు కోసం అమరావతిలో తాత్కాలిక ఏర్పాట్లు డిసెంబర్ 15 నాటికి పూర్తవుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది కనుక.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులను విభజిస్తూ నోటిఫికేషన్ జారీచేయవచ్చునని నిర్దేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశిస్తూ.. అప్పటివరకూ తాత్కాలిక ధర్మాసనాలు ఏర్పాటు చేయటానికి గల మార్గాలను పరిశీలించాలంటూ హైకోర్టు 2015 మే ఒకటో తేదీన ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తాజా ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి నగరంలో జస్టిస్ సిటీ పేరుతో హైకోర్టు, కింది కోర్టుల సముదాయం, న్యాయమూర్తులు, న్యాయాధికారులకు నివాస వసతి సదుపాయాలు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించింది.
అది పూర్తయ్యేలోగా హైకోర్టు కోసం తాత్కాలిక నిర్మాణం చేపట్టామని.. ఇది ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీలోగా పూర్తవుతుందని తెలిపింది. అలాగే న్యాయమూర్తుల కోసం విల్లాలను అద్దెకు తీసుకుంటామని చెప్పింది.
జస్టిస్ సిటీ నిర్మాణం అంశాన్ని, తాత్కాలిక ఏర్పాట్లను పరిశీలించిన కాబోయే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తంచేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. జనవరి ఒకటో తేదీ నాటికి ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్ జారీ చేయవచ్చునని నిర్దేశించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర రాజధానిలో నిర్మిస్తున్న తాత్కాలిక భవనంలో సాధ్యమైనంత త్వరగా పనిచేయటం ప్రారంభమయ్యేందుకు వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పింది.
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- భారత న్యాయ వ్యవస్థలో కొత్త చరిత్ర: సుప్రీం కోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








