పీఎస్‌ఎల్‌వీ-సీ42: అనుమానాస్పద నౌకాసంచారాన్ని గుర్తించే ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఫొటో సోర్స్, Getty Images
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం రాత్రి పీఎస్‌ఎల్‌వీ-సీ42 వాహక నౌక ద్వారా నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించినట్లు శాస్త్రవేత్తలను ప్రకటించారు.
ఈ రెండు ఉపగ్రహాలనూ బ్రిటన్‌కే చెందిన 'సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ ఆఫ్ గిల్డ్‌ఫోర్డ్' రూపొందించింది.

ఫొటో సోర్స్, ISRO
నోవాసర్ అనుమానాస్పద నౌకలను గుర్తిస్తుంది
నోవాసర్ ఉపగ్రహం ఎలాంటి వాతావరణంలోనైనా, ఏ సమయంలోనైనా.. అంటే పగటిపూటైనా, రాత్రివేళల్లో అయినా అంతరిక్షం నుంచి భూ ఉపరితలాన్ని ఫొటోలు తీయగలదు.
ఈ ఉపగ్రహం ఉపయోగాలు చాలా ఉన్నప్పటికీ ప్రధానంగా అనుమానాస్పద నౌకాసంచారాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా బ్రిటన్ దీన్ని అంతరిక్షంలోకి పంపించింది.
సముద్ర వాతావరణ స్థితిగతులనూ పరిశీలించి చిత్రాలను పంపిస్తుంది.

ఫొటో సోర్స్, SSTL/AirBus/ISRO
కాలుష్య పరిశీలనకు..
ఎస్1-4 ఉపగ్రహానికి భూమిపైన 87 సెంటీమీటర్ల పరిమాణం గల వస్తువులను కూడా సునిశితంగా పరిశీలించగలిగే సామర్థ్యం ఉంది.
ఇది చైనా భూభాగాన్ని ఫొటోలు తీస్తుంది. పట్టణ ప్రణాళిక, పంటల దిగుబడులు, కాలుష్య స్థాయి పరిశీలన, జీవ వైవిధ్య అంచనాలు సహా అనేక ఇతర ఉపయోగాల కోసం ఈ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








