పిల్లల ప్రాణాల మీదకు ఫేక్ న్యూస్: టీకాలు వేస్తే పిల్లలు పుట్టరని ప్రచారం

ఫొటో సోర్స్, Getty Images
ఫేక్ న్యూస్ అంటే తప్పుడు వార్తలు ఇప్పుడు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
వాట్సాప్‌లో వచ్చిన వదంతుల వల్ల ఈ మధ్య ఓ హైదరాబాదీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజాగా చిన్న పిల్లల టీకాలపై వాట్సాప్‌లో వదంతులు వ్యాపిస్తున్నాయి.
భారతదేశంలో ముస్లింల జనాభాను నియంత్రించేందుకే బాల్యంలోనే వంధ్యత్వ టీకాలు వేస్తున్నారన్న కల్పిత వార్తలు ప్రచారం అవుతున్నాయి.
దీంతో దేశంలో చాలా మంది ముస్లింలు తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు వెనుకాడుతున్నారు.
గుజరాత్ నుంచి బీబీసీ ప్రతినిధి దేవీనా గుప్తా అందిస్తున్న కథనాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
మా ఇతర కథనాలను చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









