నేను చేసిన అతిపెద్ద తప్పు అదే: జకర్‌బర్గ్
నకిలీ వార్తలు, ఎన్నికల్లో విదేశీ జోక్యం, ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రసంగాలను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేకపోయామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ అన్నారు.
వినియోగదారుల సమాచార దుర్వినియోగం, ప్రకటనలను నియంత్రించడంలో సరిగ్గా వ్యవహరించలేదని చెప్పారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రచారాన్ని అశ్రద్ధ చేశామని, ఆ కేసు విచారణలో భాగంగా ఫేస్‌బుక్ ఉద్యోగులను అధికారులు ప్రశ్నించారని జకర్‌బర్గ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)