ఆసియా క్రీడలు: భారత్‌కు తొలి స్వర్ణం

ఫొటో సోర్స్, facebook/Bajrang Punia
జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా బంగారు పతకం సాధించారు.
65 కిలోల విభాగంలో పునియా జపాన్‌కు చెందిన దైచీ తకటానిని 11 -8 తేడాతో ఓడించారు.
ఇంతకు ముందు సెమీ ఫైనల్లో పునియా ఉజ్బెకిస్తాన్ క్రీడాకారునిపై గెలిచారు.
తుది పోరులో పునియా మొదట ఆరు పాయింట్లు సాధించగా దైచీ సున్నా పాయింట్లతో ఉన్నారు.
తర్వాత కాసేపటికే దైచీ పుంజుకుని స్కోరును 6-6తో సమం చేశారు.

ఫొటో సోర్స్, facebook/Bajrang Punia
తర్వాత పునియా విజృంభించడంతో దైచీ 8 పాయింట్లకే పరిమితం అయ్యాడు. పునియా 11 పాయింట్లు సాధించాడు.
పునియా ఎవరు?
24 ఏళ్ల పునియా హరియాణకు చెందిన కుస్తీ క్రీడాకారుడు. ఇతను 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో 61 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. తర్వాత ఇతను 65 విభాగంలో పోటీలకు దిగారు.
ఈ ఏడాది గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ ఇతను 65 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు.
ఇతను ఏడేళ్ల వయసులోనే రెజ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. ఇతనికి భారత ప్రభుత్వం అర్జున అవార్డు కూడా ఇచ్చింది.
ఆసియా క్రీడల్లో మొదటి రోజే భారత్ పతకాల బోణీ కొట్టింది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్‌లో అపూర్వీ చండేలా, రవికుమార్ కలిసి కాంస్య పతకం సాధించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








