రాహుల్‌గాంధీ ఈమెను పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులొచ్చాయి. ఇంతకీ ఈమె ఎవరు?

ఫొటో సోర్స్, Twitter
ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వైరల్‌గా మారిన ఫొటో ఇదే.
ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు మరో యువతి ఉన్నారు.
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని రాహుల్‌గాంధీ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
దీంతో ఈ ఫొటోని ఇంటర్నెట్‌లో విరివిగా షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter
అయితే, పెళ్లి వార్తలపై ఈ యువతి స్పందించారు.
ఆ వార్తలన్నీ పుకార్లే అని ప్రకటించారు. రాహుల్‌గాంధీ తనకు అన్నతో సమానమని చెప్పారు.
దీంతో రాహుల్‌తో పెళ్లి ఊహాగానాలకు తెరపడింది.
ఇంతకీ ఆ యువతి ఎవరు?
రాహుల్‌తో ఫొటోలో ఉన్న ఆ అమ్మాయి పేరు అదితి సింగ్.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాయబరేలి సదర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాహుల్‌తో తన పెళ్లి ప్రచారం వెనక బీజేపీ హస్తం ఉండొచ్చని అదితి సింగ్ ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి కుట్రకు పాల్పడి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.


ఫొటో సోర్స్, Twitter

పుకార్లపై రాహుల్ ఏమన్నారు?
ఈ పుకార్లపై రాహుల్‌గాంధీ కూడా వివరణ ఇచ్చారు.
అదితి సింగ్ కుటుంబంతో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్‌గాంధీ చెప్పారు.
అదితి సింగ్ కుటుంబ సభ్యులు సోనియా గాంధీతో కలిసి ఉన్న ఫోటోను ఆయన మీడియాకు విడుదల చేశారు.
రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉందని చెప్పారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో కూడా ఇరు కుటుంబ సభ్యులు కలిసినప్పుడు తీసిందేనని రాహుల్ తెలిపారు.
దీనిపై సోషల్ మీడియాలో రూమర్లు రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, facebook
ఇంతకీ అదితి సింగ్ ఎవరు?
29 ఏళ్ల అదితి సింగ్‌ది ఉత్తర ప్రదేశ్. రాయబరేలి సదర్ స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆమె తండ్రి అఖిలేష్ సింగ్ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన వారసురాలిగా ఆమెను 2017 యూపీ ఎన్నికల్లో నిలబెట్టారు.
ప్రియాంకా గాంధీకి అఖిలేష్ సింగ్ సన్నిహితుడని పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది.
ఆమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీలో అదితి ఎంబీఏ చేశారు.
యూపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిని అదితి 90వేల ఓట్ల తేడాతో ఓడించారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









