#CWG2018: టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు స్వర్ణం

ఫొటో సోర్స్, Getty Images
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పంట పండుతోంది. టేబుల్ టెన్నిస్‌లో భారత్ టీం బంగారు పతకం సాధించింది.
నైజీరియాతో జరిగిన ఈ పోటీలో భారత్ 3-0తో గెలిచింది. దీంతో భారత్ ఇప్పటి వరకు సాధించిన బంగారు పతకాల సంఖ్య 9కి చేరింది.
ఒక్క టేబుల్ టెన్నిస్‌లోనే రెండు స్వర్ణాలు దక్కాయి.
దీంతో మొత్తం భారత్ సాధించిన పతకాల సంఖ్య 18కి చేరింది.
పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది.
భారత్ తరపున ఆడిన హర్మీత్ దేశాయ్, జ్ఞానశేఖరన్‌లు టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించారు.
జ్ఞానశేఖరన్ తమిళనాడుకు చెందిన క్రీడాకారుడు కాగా హర్మీత్ దేశాయ్ గుజరాత్ క్రీడాకారుడు.
సోమవారం ఒక్క రోజే భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








