బాల్ ట్యాంపరింగ్: 'సన్‌రైజర్స్' కెప్టెన్సీ నుంచి వైదొలగిన డేవిడ్ వార్నర్

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ 'సన్‌రైజర్స్ హైదరాబాద్' కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తప్పుకున్నారు.
కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
ఇదే వివాదం కారణంగా, ఐపీఎల్‌లో మరో ఫ్రాంచైజీ అయిన 'రాజస్థాన్ రాయల్స్' సారథ్య బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇంతకుముందే వైదొలగారు.
''ఇటీవలి పరిణామాల నేపథ్యంలో 'సన్‌రైజర్స్ హైదరాబాద్' కెప్టెన్ బాధ్యతల నుంచి డేవిడ్ వార్నర్ వైదొలిగారు'' అని ఫ్రాంచైజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కె.షణ్ముగం బుధవారం 'ట్విటర్'లో తెలిపారు.
కొత్త కెప్టెన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వార్నర్ 2014 నుంచి సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు. 2015లో ఆయన కెప్టెన్‌గా నియమితుడయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
2016లో వార్నర్ నాయకత్వంలోనే సన్‌రైజర్స్ తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఒప్పందం పునరుద్ధరించుకోవద్దని ఎల్‌జీ నిర్ణయం
వార్నర్‌తో స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవద్దని దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ నిర్ణయించుకొంది.
ఒప్పందం గడువు త్వరలోనే పూర్తికానుందని, తాజా పరిణామాల నేపథ్యంలో దీనిని పునరుద్ధరించుకోవద్దని నిర్ణయించినట్లు ఎల్‌జీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








