క్రికెట్: చివరి బంతికి సిక్స్.. భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన నిదాహస్ ట్రోఫీ టీ 20 ఫైనల్లో చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్ గెలిచింది.
టీ 20 క్రికెట్‌లో ఇటీవల కాలంలో ఇలాంటి ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్ జరగలేదు.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ముందు 167 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
దీన్ని భారత్ అతి కష్టం మీద అత్యంత ఉత్కంఠ మధ్య ఛేదించింది.
ముఖ్యంగా చివరి రెండు ఓవర్లకు భారత్ 34 పరుగులు చేయాల్సిన తరుణంలో దినేశ్ కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను గట్టెక్కించాడు.
19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ వరుసగా 6, 4, 6 బాది ఒత్తిడిని కాస్త తగ్గించే ప్రయత్నం చేశాడు. అయినా విజయానికి చివరి బంతి వరకూ పోరాడాల్సి వచ్చింది.
మొత్తానికి 18వ ఓవర్లో దినేశ్ కార్తీక్ 22 పరుగులు రాబట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
దీంతో విజయానికి 6 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్‌ను సౌమ్య సర్కార్ వేయగా.. మొదటి బంతిని విజయ్ శంకర్ ఎదుర్కొన్నాడు. అది వైడ్.
మళ్లీ మొదటి బంతి వేయగా పరుగులు ఏమీ రాలేదు. రెండో బంతీకి సింగిల్ తీశారు.
దీంతో 4 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి.
మూడో బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ తీయగా.. 3 బంతుల్లో 9 పరుగుల ఈక్వేషన్‌కి మ్యాచ్ చేరింది.
నాలుగో బంతిని విజయ్ శంకర్ 4గా మలచగా.. అయిదో బంతికి అవుటయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
దీంతో ఒక బంతికి 5 పరుగులు అవసరమైంది.
మొత్తానికి ఆఖరు బంతికి దినేశ్ కార్తీక్ సిక్స్ కొట్టి.. భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ 56 (42బంతుల్లో; 4×4, 3×6) అర్ధశతకంతో చెలరేగాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్ గెలుపుపై సచిన్ స్పందించాడు. దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారని.. ప్రశంసించాడు.
చివరలో దినేశ్ కార్తీక్ దగ్గరుండి భారత్‌ను గెలపించాడు. బంగ్లా బౌలర్లలో రుబేల్ రెండు వికెట్లు తీశాడు.
మొత్తానికి 8 బంతుల్లో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








