షార్క్‌లను రక్షించటం ఎలా?
- రచయిత, అర్చన
- హోదా, బీబీసీ
గుజరాత్‌లోని మత్స్యకారులు గతంలో డబ్బు కోసం వేల్స్ షార్క్‌లను ఇష్టానుసారం చంపేసేవారు. 20 ఏళ్లపాటు అక్కడ ఇదే పరిస్థితి కొనసాగింది.
అయితే, దినేశ్ గోస్వామి వచ్చాక పరిస్థితి మారింది. వేల్స్ షార్క్‌లను రక్షించేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పుడు మత్స్యకారులు కూడా ఆయనకు సహకరిస్తున్నారు.
సొర చేపల రక్షకుడిగా సేవలందిస్తున్న ఆయనపై బీబీసీ ప్రతినిధి అమిర్ పీర్‌జాదా అందిస్తున్న కథనం.
పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ కోసం దినేశ్ గోస్వామి కృషి చేస్తున్నారు. గుజరాత్‌లో వేల్స్ షార్క్‌లను కాపాడేందుకు ప్రకృతి నేచర్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు.
సముద్రంలో ఎవరి వలకైనా వేల్స్ షార్క్‌లు చిక్కితే ఈయన బృందం అక్కడికి వెళ్లి దాన్ని రక్షిస్తుంది.
‘వలలో వేల్స్ షార్క్ చిక్కుకున్నట్లు తెలిస్తే అక్కడికి పడవలో వెళ్తాం. అది ఆడా? మగా? వలలో ఎలా చిక్కుకుందో తెలుసుకుంటాం. దానికి సబంధించిన వివరాలన్నీ నమోదు చేస్తాం. జీపీఎస్ ప్రాంతాన్ని కూడా తీసుకుంటాం. తర్వాత జాగ్రత్తగా దాన్ని వలలోంచి తీసి సముద్రంలో వదిలేస్తాం’ అని దినేశ్ గోస్వామి బీబీసీకి వివరించారు.
- రిపోర్టర్: అర్చనా పుష్పేంద్ర
- ప్రొడ్యూసర్: అమీర్ పీర్జాదా
- కెమెరా: పవన్ జైస్వాల్
ఇవి కూడా చదవండి:
- శ్రీదేవి మృతిపై బోనీకపూర్ తన మిత్రుడితో ఏం చెప్పారు?
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- ఏపీ బీజేపీ నేతల అసహనం ఎవరిమీద?
- బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో ఏపీ నెటిజన్ల నిరసనలు
- బీజేపీకి 150 సీట్లు ఎందుకు రాలేదు?!
- టీడీపీ-బీజేపీ ‘యుద్ధం’ జరగకపోవటానికి కారణాలివే!!
- కాంగ్రెస్ గెలుస్తూ ఓడిపోతే.. బీజేపీ ఓడిపోతూ గెలిచింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





