ఆస్ట్రేలియా: నదిలో కూలిన సీ ప్లేన్, ఆరుగురు మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన సీ ప్లేన్ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
సిడ్నీ సమీపంలోని హాక్స్‌బరీ నదిలో సీ ప్లేన్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. మరణించిన వారిలో అయిదుగురు బ్రిటీష్ జాతీయులు కాగా మరొకరు ఆస్ట్రేలియా జాతీయుడైన పైలెట్.
నీటి లోపల 43 అడుగుల లోతులో విమానం శిథిలాలు కనిపించాయి.
సిడ్నీ సీ ప్లేన్స్ అనే సంస్థ పర్యాటకుల కోసం ఈ విమానాలను నడుపుతోంది. ఒకే ఇంజిన్ కలిగిన ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు న్యూ సౌత్ వేల్స్ తాత్కాలిక సూపరింటెండ్ మైఖేల్ గోర్మన్ తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
కళ్ల ముందే
తాను చూస్తుండగానే సీ ప్లేన్ నదిలో కూలి పోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వార్తా సంస్థ 9న్యూస్‌కు తెలిపారు.
వాతావరణం కొంత మేరకు ప్రతికూలంగా ఉందని, అయితే విమాన ప్రయాణానికి అది అంత ప్రమాదకరమేమీ కాదని స్థానిక టీవీ ఛానెల్‌తో ఒక మహిళ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
అప్పటి వరకు నిలిపి వేస్తున్నాం
ప్రస్తుత ప్రమాదానికి కారణం తెలిసేంత వరకు అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సిడ్నీ సీ ప్లేన్స్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









