కర్నూలు యాక్సిడెంట్: బస్ ఈడ్చుకుపోయిన బైక్ వెనుక కూర్చున్నది ఎవరు? ఏమయ్యారు?

ఫొటో సోర్స్, UGC
కర్నూలు జిల్లాలో శుక్రవారం(24.05.2025) జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు.. బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్‌తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తిని గుర్తించారు.
శివశంకర్ నడిపిన బైక్ వెనుక కూర్చున్నది తుగ్గలికి చెందిన ఎర్రిస్వామి అలియాస్ నాని అని కర్నూలు జిల్లా పోలీసులు చెప్పారు.
ఎర్రిస్వామిని విచారించినట్లు చెప్పిన పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగిందనేది వివరించారు.
'శివశంకర్, ఎర్రిస్వామి(వెనుక కూర్చున్నారు) ఇద్దరూ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం గ్రామం నుండి బయలు దేరారు. ఎర్రిస్వామిని తుగ్గలి వద్ద డ్రాప్ చేయడానికి శివశంకర్ ఆయన్ను తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. దారిలో కియా షోరూం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత 2.24 గంటలకు పెట్రోల్ పోయించుకున్నారు.
అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతుండగా స్కిడ్ అయి రోడ్డుకు కుడి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు.
గాయాలపాలైన ఎర్రిస్వామి శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగి, శ్వాస చూసి చనిపోయారని నిర్దర్ధించుకున్నారు. ఆ తర్వాత, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను తీద్దామనుకునేలోపే బస్సు వచ్చి ఆ బైక్‌ను ఢీ కొట్టి, కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది.
బస్సు కింద మంటలు రావడంతో అక్కడి నుంచి ఎర్రిస్వామి పారిపోయి, తన సొంతూరైన తుగ్గలికి వెళ్లిపోయారు' అని కర్నూలు పోలీసులు చెప్పారు.
ఈ ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై దర్యాప్తు జరుగుతోందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

ఏమిటీ ప్రమాదం?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలో దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో 19 మృతదేహాలను రికవర్ చేశామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ కోయ వెల్లడించారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
కర్నూలు శివారులో, కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద, నేషనల్ హైవే 44పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, NCBN/X

ఫొటో సోర్స్, UGC
‘తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం’
చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద వివరాలను కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వెల్లడించారు.
"ఈ ప్రమాదం తెల్లవారు జామున 3 గంటల నుంచి 3: 10 గంటల మధ్య జరిగింది. బైకును బస్సు ఢీకొనడంతో, ఇంధనం లీక్ అయ్యి, మంటలు చెలరేగాయి" అని కలెక్టర్ సిరి చెప్పారు.
బైకును ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా అక్కడి పరిస్థితిని బట్టి ప్రాథమికంగా తెలుస్తోందని కలెక్టర్ సిరి బీబీసీతో చెప్పారు.
''బైకు బస్సు కిందకు వెళ్లిపోయింది. బస్సు ఇంజిన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఫ్యూయల్ ట్యాంకుకు మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాం'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, UGC
‘‘బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుని...’’
బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించామని బీబీసీతో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి చెప్పారు.
వీరిలో ఇద్దరు డ్రైవర్లు కాగా, మిగిలిన వారు ప్రయాణికులని తెలిపారు.
ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందితో పాటు, బైకుపై వెళుతున్న వ్యక్తి చనిపోయారని తెలిపారు. మృతుల సంఖ్య మొత్తం 20గా ఉందని స్పష్టం చేశారు.
27 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వారందరికీ అవసరమైన చికిత్స అందించామని, కొందరు స్వస్థలాలకు వెళ్లిపోయారని వివరించారు.
డ్రైవర్, మిగిలిన బస్సు సిబ్బంది బస్సు నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు కలెక్టర్.

ఫొటో సోర్స్, UGC
'డోర్ హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిలైంది'
బస్సు డోర్ తెరుచుకోకపోవడమే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు.
''బస్సు ఇంజిన్‌కు మంటలు వైర్లు కాలిపోవడంతో డోర్స్(తలుపులు)కు సంబంధించి హైడ్రాలిక్ వ్యవస్థ పాడైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. దీనివల్ల బస్సు తలుపు తెరుచుకోకపోవడంతో కొందరు ప్రయాణికులు బయటకు వచ్చేందుకు వీల్లేక చనిపోయారు'' అని బీబీసీతో చెప్పారు కలెక్టర్ సిరి.
గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధాకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ ద్వారా స్పందించారు.
"కర్నూలు జిల్లాలోని చిన్న టేకూర్ గ్రామం సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా" అని సీఎం చంద్రబాబు తెలిపారు.
గాయపడిన వారికి, బాధిత కుటుంబాలకు అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, UGC
కర్నూల్ కలెక్టరేట్, ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు.
కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నంబర్: 08518-277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్: 9121101059
ఘటనా స్థలం వద్ద కంట్రోల్ రూమ్ నంబర్: 9121101061
కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010
వివరాల కోసం బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














