ఇజ్రాయెల్‌పై 20 నిమిషాల్లో 5,000 రాకెట్లతో హమాస్ దాడి

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ మీద హమాస్ మెరుపుదాడి, వేల రాకెట్లతో దాడి

ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు చెందిన డజన్ల కొద్దీ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఆకస్మిక దాడికి దిగారు. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్లు అక్కడ భారీ సంఖ్యలో ఉన్నారు.

తాము యుద్ధానికి సిద్ధమయ్యామని, దాడులను తిప్పికొట్టేందుకు రిజర్వ్ బలగాలను పిలిచినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, MOHAMMED SABER/EPA-EFE/REX/SHUTTERSTOCK

భారీగా ఆయుధాలు, నల్లటి దుస్తులు ధరించిన పాలస్తీనియన్ మిలిటెంట్ల బృందం పికప్ ట్రక్కులో స్డెరోట్ సిటీ చుట్టూ తిరుగుతున్నట్లు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫుటేజీలో కనిపించింది.

వీడియోల్లో ఆ మిలిటెంట్లు గాజా నుంచి 1.6 కి.మీ దూరంలో ఉన్న అక్కడి పట్టణ వీధుల్లో ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)