థాయ్‌లాండ్, కంబోడియా మధ్య మళ్లీ ఘర్షణలు: భయంతో వలసపోతున్న ప్రజలు- 8 ఫోటోలలో...

ఫొటో సోర్స్, Getty Images
కంబోడియా, థాయ్‌లాండ్ సరిహద్దుల దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.
కంబోడియా సరిహద్దులో ఘర్షణకు దిగిన తర్వాతే వైమానిక దాడులు మొదలుపెట్టినట్టు రాయల్ థాయ్ ఆర్మీ ప్రకటించింది.
సోమవారం ఉదయం సరిహద్దులో కంబోడియా జరిపిన కాల్పులలో ఒక సైనికుడు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని థాయ్ సైన్యం తెలిపింది.
అయితే థాయ్ సైన్యమే దాడి చేసిందని, తాము రియాక్ట్ కాలేదని కంబోడియా చెబుతోంది.


ఫొటో సోర్స్, Reuters
రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా సరిహద్దు ప్రాంతాలలో ఇలా పొగ కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters
సోమవారం ఉదయం సరిహద్దులో కంబోడియా జరిపిన కాల్పులలో ఒక సైనికుడు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని థాయ్ సైన్యం తెలిపింది.

ఫొటో సోర్స్, Cambodia's Ministry of Information
బాంబులు పడతాయనే భయంతో కంబోడియన్లు పెద్ద సంఖ్యలో సరిహద్దు ప్రాంతాల నుంచి వలస వెళుతూ కనిపించారు.

ఫొటో సోర్స్, Reuters
థాయ్‌లాండ్ బురిరామ్ ప్రావిన్స్‌లోని శిబిరం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ప్రజలు.

ఫొటో సోర్స్, Cambodia's Ministry of Information
కుటుంబాలు వాహనాలపై తరలిపోతున్న దృశ్యాలు కంబోడియాలో కనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల మధ్య షెల్లింగ్ కారణంగా దెబ్బతిన్న ఓ ఇల్లు.

ఫొటో సోర్స్, LILLIAN SUWANRUMPHA/AFP via Getty
35 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు థాయ్ సైన్యం తెలిపింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














