బంగారు రామాయణం: వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన ఈ రామాయణాన్ని పసిడితో రాశారు

వీడియో క్యాప్షన్, బంగారంతో రాసిన రామాయణం ఇది
బంగారు రామాయణం: వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన ఈ రామాయణాన్ని పసిడితో రాశారు

గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఈ రామాయణంలో ప్రతి పేజీలోని పంక్తులను బంగారు ఇంకుతో రాశారు. దీన్ని రాయడానికి ఇంకు కోసం 200 తులాల బంగారాన్ని, 20 తులాల బంగారాన్ని ముఖచిత్రంపై శ్రీరాముడి కోసం ఉపయోగించారు.

రాముడికి పైభాగంలో ఉన్న శివుడు, వినాయకుడు, హనుమాన్ బొమ్మలకు 2 తులాల బంగారం వాడారు. పైన తులసీకృత్ రామాయణ్ అని కెంపులు పొదిగారు.

ముఖచిత్రంపై రాముడి పక్కన స్తంభాలు, మండపానికి వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగారు.

రాముడి కిరీటంలో నీలం ఉంది. ముఖచిత్రం కవర్ వెండితో చేసింది. అంటే ఈ పుస్తకం ముఖచిత్రాన్ని బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలతో రూపొందించారు.

సూరత్‌లో ఉంటున్న రాజేష్ కుమార్ భక్త్, ఇందిరా బేన్ భక్త్ దంపతులు ప్రస్తుతం ఈ స్వర్ణ రామాయణాన్ని సంరక్షిస్తున్నారు.

1981లో ఈ స్వర్ణ రామాయణాన్ని రూపొందించారని చెబుతున్నారు.

స్వర్ణ రామాయణం
ఫొటో క్యాప్షన్, స్వర్ణ రామాయణం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)