సెక్స్ వర్కర్ నుంచి హెల్త్ వర్కర్‌గా

వీడియో క్యాప్షన్, సెక్స్ వర్కర్ నుంచి హెల్త్ వర్కర్‌గా
సెక్స్ వర్కర్ నుంచి హెల్త్ వర్కర్‌గా

ఒడిదుడుకులతో కూడిన అలీషా జీవితంలో సెక్స్ వర్క్ ఒక భాగం. ఈ పని చేస్తున్నందుకు ఆమె సిగ్గుపడట్లేదు. కానీ, ఈ పని చేయడం ఆమెకు మొదటి ప్రాధాన్యం కాదు.

ట్రాన్స్‌జెండర్ అయిన అలీషా చాలా ఏళ్లుగా హరియాణాలోని గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.

తన గుర్తింపుతో స్వేచ్ఛగా జీవించాలనే కోరికతో ఆమె ‘ఆశు’ అనే అబ్బాయి గుర్తింపు నుంచి ‘అలీషా’ అనే అమ్మాయిగా మారారు. కానీ, దీనికోసం ఆమె సెక్స్ వర్క్‌లోకి దిగాల్సి వచ్చింది.

పట్నాకు చెందిన అలీషా చాలా చిన్న వయస్సులోనే ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది.

పూట గడవడం కోసం సెక్స్ వర్క్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

తొలిసారి సెక్స్ వర్క్‌కు వెళ్లినప్పుడు తనకు నాలుగు వేల రూపాయలు వచ్చాయని తెలిపారు.

‘‘నేను అంత డబ్బును చూడటం అదే మొదటిసారి. కేవలం 10 నిమిషాల పని కోసం నాకు అంత డబ్బు ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది’’ అని ఆమె అన్నారు.

కానీ, ఇది చాలా కష్టమైన జీవితం. ఆమె ఎప్పుడూ భయం నీడలో బతుకుతుంటారు.

14 లేదా 15 ఏళ్ల వయస్సు నుంచే అలీషా ఈ పని చేస్తున్నారు. ‘‘కొన్నిసార్లు కస్టమర్లు తప్పుగా ప్రవర్తిస్తారు. కొడతారు కూడా. కొన్నిసార్లు నా పర్సును కూడా దొంగిలించారు’’ అని ఆమె చెప్పారు.

కానీ, చివరకు తనకో అవకాశం వచ్చింది. ఆ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్యం, లైంగికత అంశాలపై పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థకు అలీషాను ఆమె గురువు పరిచయం చేశారు.

అలీషా మాట్లాడే తీరు, ఆమె ఆత్మవిశ్వాసం చూసి ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు

alisha

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)