మగ కొలీగ్ ప్యాంట్ లాగిన మహిళా ఉద్యోగి, అది చిలిపి పని కాదు, లైంగిక దుశ్చర్యే అన్న కోర్టు

దక్షిణ కొరియాలో లైంగిక వేధింపుల వివాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోహ్ ఈవె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తోటి ఉద్యోగి ప్యాంట్‌ను అండర్‌వేర్ సహా అందరి ముందూ పొరపాటున లాగిన ఓ మహిళకు దక్షిణ కొరియా కోర్టు జరిమానా విధించిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

దీంతో ఆ మహిళ ఈ నేరానికి భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది.

దక్షిణకొరియాలో గ్యాంగ్వాన్ రాష్ట్రంలో 20 ఏళ్ల ఒక ఉద్యోగి ప్యాంట్‌ను, ఆయన తోటి ఉద్యోగుల సమక్షంలో కిందికి లాగేసిన ఓ 50 ఏళ్ల మహిళకు దక్షిణ కొరియా స్థానిక కోర్టు ఒకటి 28 లక్షల యువాన్లు (సుమారు రూ.1.80 లక్షలు) జరిమానాగా విధించింది.

అంతేకాదు, సెక్సువల్ వయలెన్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 8 గంటల పాటు క్లాసులు వినాలని ఆదేశించింది.

https://www.whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా మహిళా ఉద్యోగి ( ప్రతీకాత్మక చిత్రం)

గాంగ్వాన్ రాష్ట్రంలోని ఒక రెస్టారెంట్ కిచెన్‌లో గత ఏడాది అక్టోబరులో ఈ ఘటన జరిగింది. తోటి ఉద్యోగి కాబట్టి అదో చిలిపి పనిలాగా (ప్రాంక్) ఈ పని చేశానన్న ఆమె వాదనను కోర్టు తిరస్కరించింది.

ఈ చర్య లైంగిక దుశ్చర్య కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

అయితే, ఆమెకు గతంలో ఎలాంటి నేరచరిత్రా లేకపోవడం, తప్పు చేశానని పశ్చాత్తాపం పడటం, బాధితుడితో పాటు ఆయన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఇతర శిక్షలు విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టింది.

అదో ఆట అయిపోయింది

ఎవరిదైనా ప్యాంట్‌ పట్టుకొని అండర్‌వేర్‌తో సహా లాగేయడం దక్షిణ కొరియాలో ఒక చిలిపి ఆటగా, ప్రాక్టికల్ జోక్‌గా మారిపోయింది.

దీనికి 'ప్యాంట్సింగ్', లేదా 'డీబ్యాగింగ్' అని పేరు పెట్టారు. వెరైటీ షోలు, రియాలిటీ టీవీ షోల్లో కొన్నేళ్లుగా ఇది సాగుతోంది. అయితే, ఇది కొందరిని ఇబ్బంది పెడుతోంది.

2019లో, సౌత్ కొరియన్ ఒలింపిక్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్ లిమ్ హ్యో-జున్ కూడా తన తోటి ఆటగాడి ప్యాంట్‌ను మిగతా మహిళా స్కేటర్ల ముందు లాగేశాడు.

ఇందుకు శిక్షగా ఆయనపై ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు పడింది.

2021లో, నార్త్ జోలా ప్రావిన్స్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమకన్నా చిన్నవాడైన ఓ విద్యార్థిని ప్లే గ్రౌండ్‌లో బెదిరించి అందరిముందూ ప్యాంట్‌ లాగేశారు.

అప్పట్లో బాధిత విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)