అత్యాచార నిందితుడిని పట్టించిన వాషింగ్ మెషీన్.. ఎలా అంటే

రేప్ కేసులో వాషింగ్ మెషీన్ సాక్ష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిందితుడు నేరం చేయలేదన్నారు. వాాషింగ్ మెషీన్ డోర్‌లో ప్రతిబింబించిన దృశ్యాలు నిందితుడిని దోషిగా తేల్చాయి
    • రచయిత, జోయెల్ గింటో
    • హోదా, బీబీసీ న్యూస్

వరుసగా లైంగిక నేరాలకు పాల్పడుతున్న 24 ఏళ్ల వ్యక్తిని వాషింగ్ మెషీన్‌ డోర్‌లో కనిపించిన దృశ్యాల ఆధారంగా కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది.

దక్షిణకొరియాలో ఈ ఘటన జరిగింది.

ఈ లైంగిక దాడి దృశ్యాలు వాషింగ్ మెషీన్‌ డోర్‌పైన ఉండే గ్లాస్‌పై కనిపించాయి.

తర్వాత అవి సెక్యూరిటీ ఫుటేజీలో రికార్డు అయ్యాయని కథనాలు వచ్చాయి.

నిందితుడు రేప్ సహా ఇతర లైంగిక నేరాలకు పాల్పడినట్లు కోర్టు ధ్రువీకరించింది.

బాధితులు సమర్పించిన సీసీటీవీ వీడియోలో మొదట నేరానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు.

తర్వాత దర్యాప్తు అధికారులు వీడియోలో కనిపించిన వాషింగ్ మెషీన్ డోర్‌పై ప్రతిబింబాన్ని జాగ్రత్తగా పరిశీలించడంతో నేరం నిరూపితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిందితుడు తన మాజీ ప్రేయసిపైనా అత్యాచారానికి పాల్పడినట్లుగా అనుమానాలున్నాయని, ఒక మైనర్‌తో శారీరక సంబంధం పెట్టుకున్నట్లుగా, అతనిపై ఇతర నేరాభియోగాలు కూడా నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.

గత నవంబర్‌లోనే ఒక కోర్టు ఆయనకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించగా పైకోర్టులో అప్పీల్ చేశారు.

అయితే, బాధితుల్లో ఒకరితో నిందితుడు చేసుకున్న సెటిల్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆయనకు విధించిన శిక్షను ఏడేళ్లకు తగ్గించింది.

ఆ వ్యక్తి విడుదలైన తర్వాత ఏడేళ్ల పాటు ఒక ట్యాగ్‌ను కాలికి ధరించాల్సి ఉంటుంది.

అలాగే పిల్లలు, జువైనల్, అంగవైకల్యం ఉన్న వారి వసతుల్లో పనిచేయకుండా ఆయనపై ఏడేళ్ల నిషేధం విధించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)