సౌదీ అరేబియా: "మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం, 45 మంది మృతి చెందినట్లు సమాచారం" - హైదరాబాద్ సీపీ సజ్జనార్

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. భారత కాలమానం ప్రకారం, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొన్నాయి.
ఈ బస్సులో తెలంగాణకు చెందినవారు ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రమాదానికి గురైన యాత్రికులు నవంబర్ 9 నుంచి 23 వరకు యాత్రకు వెళ్లినట్లు సజ్జనార్ చెప్పారు.
మొత్తం 54 మంది నవంబర్ 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లారని ఆయన వెల్లడించారు. వారిలో నలుగురు మక్కాలో ఉండిపోయారని, మరో నలుగురు ఆదివారం కారులో మదీనాకు చేరుకున్నారనీ, మిగతా 46 మంది బస్సులో ప్రయాణిస్తుండగా.. ఆ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సజ్జనార్ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా, మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన వెల్లడించారు. 46 మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. మిగిలినవారి గురించి వివరాలు సేకరిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.
మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
వీరంతా ఈ నెల 23న జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నారని వీసీ సజ్జనార్ చెప్పారు. మృతుల్లో ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారని చెప్పారు.
''ప్రమాదంలో శరీరాలు కాలిపోవడం వల్ల గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. దీంతో ఎందరు తెలంగాణవారు మరణించారు? ఎవరెవరు మరణించారు అన్నది అధికారికంగా, స్పష్టంగా అప్పుడే చెప్పలేం. మా దగ్గరకు ప్రాథమిక సమాచారం వచ్చినప్పటికీ నిర్ధరించడానికి సమయం పడుతుంది. అప్పటి వరకూ అధికారికంగా మృతుల సంఖ్య చెప్పలేం'' అని బీబీసీతో చెప్పారు సహాయ చర్యలు చూస్తోన్న ఉన్నతాధికారి ఒకరు.

ఫొటో సోర్స్, Stefan Wermuth/Bloomberg via Getty
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సౌదీ అరేబియా ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారనే ప్రాథమిక సమాచారంపై వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సీఎం ఆదేశించారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ దుర్ఘటనపై సౌదీ ఎంబసీ అధికారులతో విదేశాంగ శాఖ మాట్లాడాలని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు ముఖ్యమంత్రి.
దిల్లీలోని కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడి అవసరమైన సూచనలు చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ ఘటనపై కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
సౌదీకి ప్రతినిధి బృందం..
సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
"మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు మైనారిటీ విభాగానికి చెందిన అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని వెంటనే సౌదీకి పంపాలని క్యాబినెట్ నిర్ణయించింది.
మృతదేహాలకు అక్కడే వారి మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపించాలని, బాధిత కుటుంబ సభ్యులను.. ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది" అని తెలంగాణ సీఎంవో తెలిపింది.
ప్రధాని మోదీ సంతాపం
మదీనాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయుల మరణించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ తగిన సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియన్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, ANI
విదేశాంగ మంత్రి ఏమన్నారంటే..
సౌదీ అరేబియా మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మృతి చెందడంపై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు రియాద్‌లో భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి మద్దతు అందిస్తున్నట్లు చెప్పారు.
బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే..
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో గత రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల బాధిత కుటుంబాలకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రగాఢ సంతాపం తెలిపింది.
ఈ ఘటనపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ, స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ తెలిపింది.
అలాగే తెలంగాణ అధికారులతో, సంబంధిత కుటుంబాలతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొంది.
కాన్సులేట్ సిబ్బంది బృందం, భారతీయ వాలంటీర్లు వివిధ ఆస్పత్రిలో సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపింది.
జెడ్డాలో 24X7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే..
సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చనిపోయినవారిలో 18 మంది తెలుగువారు ఉన్నారని అన్నారు.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా, సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడి, అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
విచారం వ్యక్తం చేసిన అసదుద్దీన్..
భారతీయ ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాద ఘటనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విచారం వ్యక్తం చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
తాను హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలతో మాట్లాడి ప్రయాణికుల సమాచారాన్ని రియాద్ ఎంబసీతో పంచుకున్నట్లు చెప్పారు.
రియాద్‌లో ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్(డీసీఎం) మాథెన్ జార్జ్‌తో తాను మాట్లాడానని చెప్పారు. స్థానిక అధికారుల నుంచి ఈ ఘటనపై సమాచారం సేకరించి తెలియజేస్తానని ఆయన చెప్పినట్లు అసదుద్దీన్ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)